
భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలి: చాడ
మియాపూర్: మియాపూర్ భూ కుంభ కోణంపై సీబీఐతో విచారణ జరిపించి, నిజానిజాలను తేల్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. మియాపూర్‌లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను సీపీఐ నాయకులు, కార్యకర్తలతో కలసి ఆయన శనివారం పరిశీలించారు.
కస్టడీలో ఉన్నవారు పాత్రధారులు మాత్రమేనని, తెర వెనక ఉన్న కథానాయకులను వెలికి తీయాల్సిన బా«ధ్యత ప్రభుత్వానిదేనని చాడ అన్నారు. కబ్జాకు పాల్పిడిన భూముల రిజిస్ట్రేషన్లను పూర్తిగా రద్దు చేయాలని, ఆక్రమ ణకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలని కోరారు. కబ్జాదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే సీపీఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని అన్నారు. సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలమల్లేష్ పాల్గొన్నారు.