హైదరాబాద్: దివంగత సంగీత దర్శకుడు చక్రి స్టూడియోలో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కమలాపురి కాలనీలో ఉన్న స్టూడియోను పెట్రోలు పోసి దహనం చేయటంతో ఆస్తి నష్టం సంభవించిందని చక్రి భార్య శ్రావణి మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు..
కమలాపురి కాలనీలో చక్రి పేరుతో సీ-స్టూడియో ఉంది. కాగా, దీనికి సంబంధించిన తాళం చెవి శ్రావణి వద్దే ఉంది. సోమవారం జూబ్లీహిల్స్ పోలీసుల అనుమతితో ఈ స్టూడియోను తెరిచి కార్యకలాపాలు నిర్వహించారు. అయితే అర్ధరాత్రి 11 గంటల సమయంలో స్టూడియోలోంచి మంటలు వస్తున్నట్లు ఇంటి యజమాని రమేష్‌చంద్ తమకు సమాచారం అందించారని వివరించారు. అదే రాత్రి వచ్చి చూడగా స్టూడియో మొత్తం దగ్ధమై ఉందని శ్రావణి తెలిపారు. తాను స్టూడియోను నడిపించటం కొంత మందికి నచ్చడం లేదని.. దీని వెనుక తన అత్త, మరిది ప్రమేయం ఉందని ఆరోపించారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉన్న విషయం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. స్టూడియో దహనం వెనుక కారణాలపై దర్యాప్తు చేయాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, గుర్తు తెలియని దుండగులు దాడి చేసినట్లు చక్రీ సోదరుడు మహిత్ నారాయణ కూడా మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతరాత్రి చక్రి ఆఫీస్పై దాడి చేసిన దుండగులు అక్కడ ఫర్నిచర్ను దగ్ధం చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
చక్రి స్టూడియోలో అగ్ని ప్రమాదం
Published Tue, Feb 3 2015 7:18 PM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement
Advertisement