సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మాధవరావు అలియాస్ మహిత్ నారాయణ్ సదరం సర్టిఫికెట్ కోసం రెండేళ్లుగా తిప్పలు పడుతున్నాడు. లాక్‌డౌన్‌తో పాత స్లాట్ రద్దు కాగా.. కొత్త స్లాట్ బుక్ కాకపోవడంతో పడరాని పాట్లుపడుతున్నాడు. సర్కారు ఆసుపత్రిలో నిర్వహించే సదరం క్యాంప్‌లతో పాటు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని సోమవారం విలేకరుల ఎదుట గోడు వెళ్లబోసుకున్నాడు.
ఇదీ పరిస్థితి..
మహబూబాబాద్ జిల్లా కంభాలపల్లి గ్రామానికి చెందిన జిల్లా మాధవరావు ఉన్నత విద్యాభాసం కోసం నగరానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. ప్రస్తుతం ఆయన బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. పుట్టుకతోనే వైకల్యానికి గురైన ఆయన వీల్‌చైర్‌పై దైనందిన కార్యకలాపాలు పూర్తి చేసుకుంటాడు. అయితే తనసోదరుడి వద్ద నేర్చుకున్న సంగీతంతో కొత్తగా మ్యూజిక్ స్టూడియో పెట్టుకునేందుకు వికలాంగుల కోటా కింద బ్యాంకు రుణం కావాలని కొద్దిరోజుల క్రితం ఆయన నగరంలోని ఓ బ్యాంకును ఆశ్రయించగా, సదరం సర్టిఫికెట్ తప్పని సరిగా ఉండాలని అధికారులు సూచించారు. వివిధ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. సర్టిఫికెట్ కోసం రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్నానని, ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన వేడుకుంటున్నారు.
చదవండి👉 R Madhavan: నా తండ్రి గుర్తింపుతో బతకాలని లేదు: మాధవన్ కొడుకు వేదాంత్
Comments
Please login to add a commentAdd a comment