అద్దె ఇంటి నుంచి ఫాంహౌస్కు చంద్రబాబు | Chandrababu naidu shift to a farm house in hyderabad | Sakshi
Sakshi News home page

అద్దె ఇంటి నుంచి ఫాంహౌస్కు చంద్రబాబు

Published Tue, Feb 23 2016 4:03 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

అద్దె ఇంటి నుంచి ఫాంహౌస్కు చంద్రబాబు - Sakshi

అద్దె ఇంటి నుంచి ఫాంహౌస్కు చంద్రబాబు

హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో ఇల్లు మారబోతున్నారు.  హైదరాబాద్లో అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన త్వరలో ఫాంహౌస్కు వెళ్లనున్నారు. వాస్తు సమస్యల కారణంగా చంద్రబాబు కుటుంబం ఇప్పుడు ఉంటున్న ఇల్లు మారుతున్నట్లు సమాచారం. అలాగే నిర్మాణం పూర్తి కాగానే చంద్రబాబు ఫాంహౌస్ నుంచి సొంతింటికి వెళ్లే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25లో అద్దె ఇంట్లో ఉంటున్న విషయం తెలిసిందే.

 కాగా బాబు సీఎం పీఠం ఎక్కిన తరువాత వాస్తుకు ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రూ.కోట్లు వెచ్చించి సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్, క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తున్న లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌లలో అనేక మార్పు చేర్పులు కూడా చేశారు. అయితే ఓటుకు కోట్లు కేసు అనంతరం చంద్రబాబు తన మకాన్ని విజయవాడకు మార్చారు. అక్కడ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement