ఆదాయపన్ను రిటర్న్స్‌లో చీటింగ్
ఈ సమాచారం ఆధారంగా హైదరాబాద్‌లోని ఆదాయ పన్ను శాఖ పరిశోధన విభాగం తనిఖీలు, సర్వేలు జరపగా, ఇంటి అద్దె వ్యయం, వైద్య ఖర్చులు, వివిధ పథకాల్లో పొదుపులు, తదితర పేర్లతో ఆదాయ పన్ను నుంచి మినహాయింపు కోరుతూ తప్పుడు క్లెయిమ్స్ సమర్పించారని వెల్లడైందన్నారు. ఐటీ కంపెనీల హెచ్‌ఆర్ విభాగంలోని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు నిబంధనల మేరకు టీడీఎస్ రూపంలో సరైన పన్ను మినహాయింపులతో ఉద్యోగుల జీతాల నుంచి ఆదాయ పన్నును ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తున్నారని తెలిపారు. అయితే, ప్రముఖ ఐటీ కంపెనీల్లోని కొందరు ఉద్యోగులు ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ల సాయంతో తప్పుడు క్లెయిమ్ చేస్తూ ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీ నుంచి ఫాం–16ను పొంది ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ల సాయంతో తప్పుడు మినహాయింపులు పొందారని వెల్లడించారు. అనైతిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీల హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్లకు అడ్వైజరీ జారీ చేశామన్నారు.