నల్ల కుబేరుల కమీషన్ దందా! | Black billionaire Commission danda | Sakshi
Sakshi News home page

నల్ల కుబేరుల కమీషన్ దందా!

Published Sat, Nov 12 2016 2:40 AM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM

నల్ల కుబేరుల కమీషన్ దందా! - Sakshi

నల్ల కుబేరుల కమీషన్ దందా!

- 10 నుంచి 50 శాతం కమీషన్ ముట్టజెబుతామని బేరసారాలు
- వెనకడుగు వేస్తున్న సామాన్య జనం
- అందిన కాడికి దోచుకుంటున్న బ్లాక్ దందా వ్యాపారులు
- కిలోల కొద్దీ బంగారం కొనుగోలు చేస్తున్న నల్ల కుబేరులు..
- క్యాష్ చేసుకుంటున్న బంగారం వ్యాపారులు
- 10 గ్రాములకు రూ.50 వేల చొప్పున విక్రయం
 
 సాక్షి, హైదరాబాద్: కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడంతో తమ వద్ద ఉన్న నల్ల ధనాన్ని వైట్‌గా మార్చుకునేందుకు నల్ల కుబేరులు కొత్త కమీషన్ దందాలకు తెరతీస్తున్నారు. సామాన్యులు, ఉద్యోగులు, వ్యాపారులు, పరిశ్రమలు నడుపుతున్న వారు, పెట్రోల్ బంకుల యజమానులు, ఆస్పత్రుల నిర్వాహకులు, ఇన్‌ఫ్రా కంపెనీలను నడుపుతున్న వారిని సంప్రదిస్తున్నారు. 10 నుంచి 50 శాతం కమీషన్ ముట్టజెబుతామంటూ బేరసారాలు ఆడుతున్నారు. తాము ఇచ్చే కమీషన్‌తో సర్దుకుని నల్ల ధనాన్ని తీసుకోవాలని బంపర్ ఆఫర్లు ఇస్తుండటంతో సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. రూ.2.50 లక్షలకు పైబడి నగదును సొంత ఖాతాల్లో డిపాజిట్ చేస్తే ఆ సమాచారం ఐటీ శాఖకు చేరుతుందన్న సమాచారంతో సామాన్యులు నల్లకుబేరుల ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. అరుుతే కొందరు బ్లాక్ దందా సాగిస్తున్న వ్యాపారులు మాత్రం ఈ దందాలో పెద్ద మొత్తంలో వెనకేసుకునేందుకు స్కెచ్ వేస్తున్నారు. పలువురు రియల్టర్లు, వడ్డీవ్యాపారులు, ట్రేడర్లు ఇప్పుడు కమీషన్ దందాలో నిమగ్నమైపోతున్నారు. ఈ అక్రమ దందాపై పోలీసు లు, ఐటీశాఖ అధికారులు నిఘా పెట్టి, అక్రమార్కులను కట్టడిచేయా లని ప్రజలు కోరుతు న్నారు.
 
 ఒక్కరోజే రూ.500 కోట్ల వ్యాపారం!
 నల్లకుబేరుల నోట్ల కట్టలను హైదార బాద్‌లోని బంగారు, వజ్రాభరణాల వ్యాపారులు క్యాష్ చేసు కుంటున్నారు. రూ.100 నోట్ల కట్టలతో వచ్చినవారికి 10 గ్రాముల బంగారాన్ని రూ.33 వేలకు విక్రరుుస్తుండగా, రూ.500, రూ.1,000 నోట్ల కట్టలతో వచ్చిన నల్లకుబేరులకు మాత్రం 10 గ్రాముల బంగారాన్ని రూ.50 నుంచి రూ.60 వేలకు విక్రరుుంచి సొమ్ము చేసుకుంటున్నారు. బేగంబజార్, సిద్ధి అంబర్ బజార్, బషీర్‌బాగ్, శాలిబండ, గుల్జార్ హౌజ్, మహంకాళి తదితర ప్రాంతాల్లో బ్లాక్‌లో జోరుగా బంగారాన్ని విక్రరుుంచారు. నల్ల కుబేరులు బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. 100 గ్రాముల బిస్కెట్‌లు (24 క్యారెట్లు) భారీగా కొనుగోలు చేసినట్లు వ్యాపారులు చెబుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే హైదరాబాద్‌లో రూ.500 కోట్ల విలువైన కొనుగోళ్లు జరిగినట్లు మార్కెట్ వర్గాల అంచనా. నల్ల కుబేరుల నుంచి అందినకాడికి దండుకున్న వ్యాపారులు తాము సేకరించిన నగదుకు 2 శాతం కస్టమ్స్ డ్యూటీ చెల్లించి.. పాత తేదీల్లో విక్రరుుంచినట్లు చూపుతూ.. నగదును వైట్‌మనీగా చెలామణీ చేసుకుంటున్నట్లు సమాచారం. మరికొందరు వ్యాపారులు నల్ల కుబేరుల ఇంటికే వెళ్లి కిలోల కొద్దీ బంగారాన్ని విక్రరుుంచి క్యాష్ చేసుకుంటున్నట్లు తెలిసింది.
 
 ‘మీ అకౌంట్‌లో డబ్బు వేసుకొని.. మాకు వైట్‌మనీ ఇవ్వండి.. లేదా మీ చెక్కు ఇవ్వండి ఇందుకు మీకు 20 శాతం కమీషన్ ముట్టజెబుతాం
 - ఓ ఉద్యోగికి ఓ నల్ల కుబేరుడి బంపర్ ఆఫర్
 
 ‘మీకరెంట్ అకౌంట్‌లో రూ.50 లక్షలు వేసుకొని మాకు చెక్ ఇవ్వండి... మీకు నగదు మొత్తానికి 40 శాతం కమీషన్ ఇస్తాం’
 - ఓ వ్యాపారికి ఓ బిగ్‌షాట్ ఫోన్‌కాల్..
 
 ‘మీ దగ్గరున్న నగదును మా వద్దకు తీసుకురండి... మీరు ఇచ్చిన మొత్తంలో 10 శాతం కమీషన్‌గా తీసుకుని మిగిలిన మొత్తాన్ని వారుుదాల పద్ధతిలో ఏడాదిలో మీకు ముట్టజెబుతాం..’  
- ఓ నల్ల కుబేరుడికి హైదరాబాద్‌లోని ఓ వ్యాపారి ఇచ్చిన ఆఫర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement