చిన్నారుల భద్రతకు ‘నిశ్చింత్’
మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లల భద్రతపై తల్లిదండ్రులకు ఎంతో ఆందోళన ఉందని, నిశ్చింత్ సంస్థ రూపొందించిన మొబైల్ యాప్‌తో ఇకపై వారంతా నిశ్చింతగా ఉండొచ్చని ఐటీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. డిజిటల్ తెలంగాణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం హోటల్ తాజ్‌కృష్ణలో ‘నిశ్చింత్’ మొబైల్ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. సైబర్ సెక్యూరిటీ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా సైబర్ ట్రైనింగ్ అకాడమీని త్వరలో నెలకొల్పుతామని మంత్రి చెప్పారు.
దీని కోసం సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సెన్సైస్‌తో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోనుందని చెప్పారు. ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ మాట్లాడుతూ నిశ్చింత్ యాప్ తరహా ఉత్పత్తులు మరిన్ని రావాలన్నారు. నిశ్చింత్ సంస్థ వైస్‌చైర్మన్ కేఎస్ పరాగ్, సంస్థ సీఈవో రాఘవ్ మాట్లాడుతూ.. చిన్నారుల మొబైల్స్‌లోని ఫోన్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, వీడియోలు, చిత్రాలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండేలా నిశ్చింత్ యాప్‌ను రూపొందించామన్నారు.