నామినేటెడ్ పోస్టుల భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ | CM KCR green signal to fill vacant nominated posts | Sakshi
Sakshi News home page

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

Published Fri, Mar 18 2016 7:45 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

CM KCR green signal to fill vacant nominated posts


హైదరాబాద్ : తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఊరిస్తూ నామినేటెడ్ పోస్టులు త్వరలో భర్తీ కానున్నాయి. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పార్టీ ప్లీనరీ సమావేశంలోపే ప్రభుత్వ నామినేటెడ్, పార్టీ పోస్టులు భర్తీ కానున్నాయి. శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు.  అలాగే కరువు నివారణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, జిల్లాల వారీగా నివేదికలు తెప్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమావేశం వివరాలను మీడియాకు వివరించారు. ఏప్రిల్ 27న ఖమ్మంలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం ప్రతినిధుల సభ, సాయంత్రం బహిరంగ సభ ఉంటుందన్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం సీఎం కేసీఆర్ బస్సుయాత్ర చేపట్టనున్నట్లు కడియం తెలిపారు. పార్టీ చేపట్టిన కార్యకర్తల బీమా పథకానికి నెల జీతం ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిర్ణయించారని, ఇతరులు సాయం చేసినా స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement