TRSLP
-
రేవంత్ మాటలు శ్రుతి మించితే ఏం చేయాలో తెలుసు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గత కొద్ది రోజులుగా మాట్లాడిన తీరుపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. గురువారం పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఓ డ్రామా ఆర్టిస్టు అని, టెంట్, స్టంట్, ప్రెజెంట్, ఆబ్సెంట్ అన్నట్టుగా రేవంత్ రాజకీయం నడుస్తోందని ఎద్దేవాచేశారు. రేవంత్ తొక్కుతా అంటున్నాడు.. వంద మంది ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్ఎస్ తలుచుకుంటే నిన్ను ఎంత లోతు తొక్కగలమో తెలుసా? అని ధ్వజమెత్తారు. రేవంత్ తీరుపై కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాయాలనే యోచనలో భాగంగా సోనియా, రాహుల్ కు ట్విట్టర్ లో లేఖ రాశానన్నారు. రేవంత్ మాటలు శ్రుతి మించితే ఏం చేయాలో తమకు తెలుసునని, కాంగ్రెస్‌లో పెద్ద నాయకులు లేనిది చూసి దొరికింది దోచుకోవడేమే రేవంత్ వైఖరి అని ఆరోపించారు. -
తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ దుకాణం బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ పేరు కనుమరుగైంది. ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరాడు. దీంతో టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో టీడీపీ విలీనం అయ్యింది. ఈ సందర్భంగా బుధవారం మెచ్చా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి టీడీపీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు లేఖ ఇచ్చారు. దీనిపై త్వరలోనే అధికారిక బులిటెన్ వెలువడనుంది. 2018 ఎన్నికల్లో అశ్వారావుపేట ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి మెచ్చా నాగేశ్వరరావు గెలిచారు. ఆయన టీఆర్ఎస్లో చేరుతారని ఎప్పటి నుంచో సాగుతున్న ప్రచారానికి నేటితో తెరపడింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మెచ్చా సమావేశమయ్యారు. తాజాగా టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు మెచ్చా ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి లేఖ అందించారు. అనంతరం శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కూడా సమావేశమయ్యారు. ఇప్పటికే టీఆర్ఎస్తో కలిసి ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర తాజాగా అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును కూడా తీసుకొచ్చారు. స్పీకర్‌ను కలిసిన సమయంలో ఎమ్మెల్యేల మెడలో గులాబీ కండువా ఉండడం విశేషం. వారిద్దరి రాకతో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ప్రాతినిధ్యం కరువైంది. చదవండి: 9 నుంచి 19 వరకు మొత్తం బంద్ -
రాజ్యంగంపై కేసీఆర్‌కు గౌరవం లేదు
-
టీఆర్ఎస్ఎల్పీలో విలీనమైన సీఎల్పీ
-
తెలంగాణ రైతులు ఏం పాపం చేశారు
హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ రైతులకు రూ. 50 వేల కోట్ల రుణమాఫీని కేంద్రప్రభుత్వమే భరిస్తోందని.. మరి తెలంగాణ రైతులు ఏం పాపం చేశారు? అని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, గణేష్ గుప్తా, చింతా ప్రభాకర్‌లు టీఆర్ఎస్ఎల్పీలో విలేకరులతో మాట్లాడారు. తాము నాలుగు విడతలుగా 17 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని చెప్పారు. కేంద్రం తెలంగాణ రైతుల రుణ మాఫీ విషయంలో భాద్యత తీసుకోదా? అని సూటిగా అడిగారు. కనీసం తెలంగాణ రుణంలో 50 శాతం కేంద్రం భరించ లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ అన్నింటా వివక్షతకు గురైన రాష్ట్రం అని పేర్కొన్నారు. దోచుకోబడ్డ తెలంగాణకు మీరు న్యాయం చేయరా అని అడిగారు. దోచుకున్న ఏపీకి ప్రత్యేక ప్యాకేజీయా? అని మండిపడ్డారు. బనారస్ హిందూ విశ్వ విద్యాలయం కోసం రూ.100 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఉస్మానియాకు నిధులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కానీ కొన్ని విషయాల్లో కేంద్రం తీరు సక్రమంగా లేదన్నారు. రాజకీయ కోణంలో రాష్ట్రాలకు కేటాయింపులు సరికాదని అన్నారు. తెలంగాణ బీజేపీ నాయకులు పీఎం మోదీపై ఒత్తిడి తెచ్చి కేంద్రం నుంచి నిధులు వచ్చేలా చేయాలని కోరారు. వెంటనే తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. రైతులకు సంబంధించిన విషయంలో జాతీయ స్థాయిలో ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేశారు. -
'రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు'
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సూచించారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ఎల్ పీ సమావేశంలో అసెంబ్లీ కార్యాచరణపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన మార్గాలపై నేతలతో చర్చించారు. సభలో ఎవరూ నోరు జారొద్దని, విపక్షాలు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని చెప్పారు. మంత్రులు పూర్తి తమ శాఖలను సంబంధించిన పూర్తి సమాచారంతో సభకు హాజరుకావాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పకుండా సభకు హాజరుకావాలని సూచించారు. పెద్దనోట్ల రద్దు చర్చలో అందరూ పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ప్రజలకు చెప్పుకోవాలని అన్నారు. -
నామినేటెడ్ పోస్టుల భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఊరిస్తూ నామినేటెడ్ పోస్టులు త్వరలో భర్తీ కానున్నాయి. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పార్టీ ప్లీనరీ సమావేశంలోపే ప్రభుత్వ నామినేటెడ్, పార్టీ పోస్టులు భర్తీ కానున్నాయి. శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే కరువు నివారణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, జిల్లాల వారీగా నివేదికలు తెప్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమావేశం వివరాలను మీడియాకు వివరించారు. ఏప్రిల్ 27న ఖమ్మంలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం ప్రతినిధుల సభ, సాయంత్రం బహిరంగ సభ ఉంటుందన్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం సీఎం కేసీఆర్ బస్సుయాత్ర చేపట్టనున్నట్లు కడియం తెలిపారు. పార్టీ చేపట్టిన కార్యకర్తల బీమా పథకానికి నెల జీతం ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిర్ణయించారని, ఇతరులు సాయం చేసినా స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. -
'గ్రేటర్'లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం: కేసీఆర్
-
'గ్రేటర్'లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం: కేసీఆర్
హైదరాబాద్: టీఆర్ఎస్ఎల్పీ భేటీ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం తెలంగాణభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం ఖాయమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ టీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా ఎమ్మెల్యేలు వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం లేదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం డివిజన్కొక ఎమ్మెల్యేతోపాటూ, నియోజ వర్గానికికొక మంత్రిని ఇంఛార్జ్‌గా కేసీఆర్ నియమించారు. -
ప్రతిపక్షాలు పారిపోయేంతవరకూ అసెంబ్లీ..
హైదరాబాద్ : విపక్షాలు కోరినన్ని రోజులు శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని, ప్రజలకు వాస్తవాలు వెల్లడిద్దామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశమైంది. ఈ సందర్భంగా కేసీఆర్... మాట్లాడుతూ ప్రతిపక్షాలు పారిపోయేంతవరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిద్దామని అన్నారు. అసెంబ్లీలో 100శాతం హాజరు ఉండాలని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూర్తి సమాచారంతో సమావేశాలకు రావాలని సూచించారు. అన్ని అంశాలపై చర్చించే వరకూ సభ నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. అలాగే 84 మార్కెట్ కమిటీలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. -
ఒక్కో గ్రామం దత్తత తీసుకొండి
హైదరాబాద్: ప్రతి ఎమ్మెల్యే ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గ్రామీణజ్యోతి కార్యక్రమం గురించి జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈనెల 17వ తేదీన గ్రామీణ జ్యోతి కార్యక్రామన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. మార్కెట్ కమిటీలను రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేస్తామని, జిల్లాల వారీగా అర్హుల జాబితాలను రూపొందించాలని సూచించారు. అలాగే, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల నియామకాన్ని వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని తెలిపారు. ఈ నెల 15 తర్వాత నామినేటెడ్ పోస్టులు, పార్టీ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. 1984-85 సమయంలో ఎన్టీఆర్ మంచిపాలన అందించినా తర్వాత ఎన్నికల్లో టీడీపీ పోయిందని, పార్టీ-ప్రభుత్వం సమన్వయంతో పనిచేయకపోతే ఇబ్బందులు వస్తాయని కేసీఆర్ హెచ్చరించారు. -
పాత్రధారి జైలుకు వెళ్లాడు.. సూత్రధారీ వెళ్లక తప్పదు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితోపాటు దీంతో సంబంధం ఉన్నవారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని తెలంగాణ మంత్రులు పేర్కొన్నారు. ఈ కేసులో పాత్రధారి జైలుకు వెళ్లాడని, సూత్రధారి కూడా వెళ్లక తప్పదన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్ రెడ్డి గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత టీడీపీ ఎన్టీఆర్ ఆశయాలకు ఎప్పుడో నీళ్లొదిలిందని, ఇప్పుడున్న నేతలు స్వార్థంతో అటు ఎన్టీఆర్, ఇటు పార్టీ పరువును బజారుకీడుస్తున్నారని అన్నారు. రూ. 10 వేలు లంచం తీసుకుంటే మంత్రిని సస్పెండ్ చేసిన పార్టీలో రూ.50 లక్షలు లంచం ఇచ్చిన వారికి హారతులు పడుతున్నారని తుమ్మల ఎద్దేవా చేశారు. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన కేసులో బెయిల్ వస్తే గొప్ప వ్యక్తికి స్వాగతం పలికినట్లు చేయడం విడ్డూరమని పోచారం వ్యాఖ్యానించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే డబ్బులు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి ఇరికించారని బుకాయిస్తున్నారని అన్నారు. రేవంత్‌కు బెయి ల్ మాత్రమే వచ్చిందని మళ్లీ జైలుకు వెళ్లక తప్పదన్నారు. చంద్రబాబు ఈ కేసు నుంచి తప్పించుకోలేరని, అసలు కథ ముందుందని, రెండు రోజుల్లో ఏం జరుగుతుందో రుచిచూస్తారని మహేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
స్వామిగౌడ్‌కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీ విలీనంపై న్యాయస్థానం ఈ మేరకు సోమవారం నోటీసులు ఇచ్చింది. ఏ ప్రాతిపదికన టీడీపీ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ఎల్పీలో విలీనమైనట్లు ప్రకటించారో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మార్చి 9న టీడీపీ ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, పట్నం నరేందర్‌రెడ్డి, గంగాధర్‌రెడ్డి, ఎండీ సలీంను గుర్తిస్తూ సీట్లు కేటాయించాలని మండలి చైర్మన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీ విలీనమైనట్లుగా అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాం అప్పట్లో ఓ బులెటిన్ కూడా విడుదల చేశారు. దీన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. -
ఒకే గదిని రెండు రాష్ట్రాలకు కేటాయించారు
-
ఒకే గదిని రెండు రాష్ట్రాలకు కేటాయించారు
హైదరాబాద్ : రాష్ట్రాలు విడిపోయినా రాష్ట్ర విభజన చిక్కులు వీడటం లేదు. తాజాగా అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ్యులకు గదుల కేటాయింపు గందరగోళానికి దారి తీసింది. తెలంగాణ అసెంబ్లీ సెక్రటేరియట్ టీఆర్ఎస్ ఎల్పీకి కేటాయించిన గదులనే ఆంధ్రపద్రేశ్ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులకు కేటాయించటం జరిగింది. దాంతో ఒకే గదిని రెండు రాష్ట్రాలకు కేటాయించటంతో వివాదం నెలకొంది. ఇక అసెంబ్లీ ప్రాంగణంలో ఆయా రాజకీయ పార్టీలకు కార్యాలయాలను కేటాయిస్తూ అసెంబ్లీ కార్యదర్శి సదారాం శుక్రవారం సర్క్యూలర్ జారీ చేశారు. సీఎల్పీ కార్యాలయాన్ని టీఆర్ఎస్ఎల్పీకి, టీఆర్ఎస్ఎల్పీ ఆఫీస్‌ను సీఎల్పీకి కేటాయించారు. డిప్యూటీ స్పీకర్ కార్యాలయాన్ని యథావిధిగా కొనసాగించనున్నారు. -
సంబరాల్లో తెలంగాణ భవన్
-
నేడు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్లో జరగనుంది. ఈ సమావేశంలో ఆపార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, తదితర నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. కాగా కేసీఆర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగి ఎన్నుకోనున్నట్లు సమాచారం. -
నేడు టీఆర్ఎస్ఎల్పీ అత్యవసర భేటీ
అసెంబ్లీలో సీమాంధ్ర నేతలను ఎదుర్కొనే వ్యూహంపై చర్చ! టీఆర్ఎస్ శాసనసభాపక్ష అత్యవసర సమావేశాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణభవన్‌లో మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. మెదక్ జిల్లాలోని తన ఫాంహౌజ్ నుంచి హైదరాబాద్‌లోని నివాసానికి శనివారం సాయంత్రం చేరుకున్న కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, టి.హరీష్‌రావు, కేటీఆర్, ఏనుగు రవీందర్‌రెడ్డి, పార్టీ నేతలు నాయిని నర్సింహారెడ్డి, ఎస్.నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో చర్చ రాకుండా సీమాంధ్ర నేతలు వేస్తున్న ఎత్తులను చిత్తు చేసే వ్యూహంపై చర్చించడానికి టీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశమవుతోందని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు వెల్లడించారు. తెలంగాణ కంటే ప్రాధాన్యాంశమేంది?: కేటీఆర్ తెలంగాణ ఏర్పాటుకంటే ప్రాధాన్యమున్న, తీవ్రమైన అంశం ఏముందని కేటీఆర్ శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రస్తుత సమావేశాల్లో తెలంగాణపై చర్చ చేపట్టాలని, సోమవారం జరిగే బీఏసీ సమావేశంలో అన్ని పార్టీలు స్పందించాలని డిమాండ్ చేశారు. సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి అసెంబ్లీ వేదికగా తెలంగాణకు సహకరించాలని కోరారు.