ఒక్కో గ్రామం దత్తత తీసుకొండి | every mla should adopt atleast one village: kcr | Sakshi
Sakshi News home page

ఒక్కో గ్రామం దత్తత తీసుకొండి

Published Wed, Aug 12 2015 5:46 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

ఒక్కో గ్రామం దత్తత తీసుకొండి - Sakshi

ఒక్కో గ్రామం దత్తత తీసుకొండి

హైదరాబాద్: ప్రతి ఎమ్మెల్యే ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గ్రామీణజ్యోతి కార్యక్రమం గురించి జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈనెల 17వ తేదీన గ్రామీణ జ్యోతి కార్యక్రామన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. మార్కెట్ కమిటీలను రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేస్తామని, జిల్లాల వారీగా అర్హుల జాబితాలను రూపొందించాలని సూచించారు.

అలాగే, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల నియామకాన్ని వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని తెలిపారు. ఈ నెల 15 తర్వాత నామినేటెడ్ పోస్టులు, పార్టీ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. 1984-85 సమయంలో ఎన్టీఆర్ మంచిపాలన అందించినా తర్వాత ఎన్నికల్లో టీడీపీ పోయిందని, పార్టీ-ప్రభుత్వం సమన్వయంతో పనిచేయకపోతే ఇబ్బందులు వస్తాయని కేసీఆర్ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement