'రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు'
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సూచించారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ఎల్ పీ సమావేశంలో అసెంబ్లీ కార్యాచరణపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన మార్గాలపై నేతలతో చర్చించారు.
సభలో ఎవరూ నోరు జారొద్దని, విపక్షాలు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని చెప్పారు. మంత్రులు పూర్తి తమ శాఖలను సంబంధించిన పూర్తి సమాచారంతో సభకు హాజరుకావాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పకుండా సభకు హాజరుకావాలని సూచించారు. పెద్దనోట్ల రద్దు చర్చలో అందరూ పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ప్రజలకు చెప్పుకోవాలని అన్నారు.