తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్‌లో జరగనుంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్‌లో జరగనుంది. ఈ సమావేశంలో ఆపార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, తదితర నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. కాగా కేసీఆర్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగి ఎన్నుకోనున్నట్లు సమాచారం.