విపక్షాలు కోరినన్ని రోజులు శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని, ప్రజలకు వాస్తవాలు వెల్లడిద్దామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు.
హైదరాబాద్ : విపక్షాలు కోరినన్ని రోజులు శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని, ప్రజలకు వాస్తవాలు వెల్లడిద్దామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశమైంది. ఈ సందర్భంగా కేసీఆర్... మాట్లాడుతూ ప్రతిపక్షాలు పారిపోయేంతవరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిద్దామని అన్నారు.
అసెంబ్లీలో 100శాతం హాజరు ఉండాలని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూర్తి సమాచారంతో సమావేశాలకు రావాలని సూచించారు. అన్ని అంశాలపై చర్చించే వరకూ సభ నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. అలాగే 84 మార్కెట్ కమిటీలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.