టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ ముగిసింది.
హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం తెలంగాణభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం ఖాయమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
సర్వేలన్నీ టీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా ఎమ్మెల్యేలు వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం లేదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం డివిజన్కొక ఎమ్మెల్యేతోపాటూ, నియోజ వర్గానికికొక మంత్రిని ఇంఛార్జ్గా కేసీఆర్ నియమించారు.