
'ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చకు సిద్ధం'
హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ ప్రశ్నోత్తరాల తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చిద్దామన్నారు.
అసెంబ్లీలో బుధవారం జరిగిన పరిస్థితులపై తాను బాధపడుతున్నానన్నారు. విపక్షాలకు చెందిన ఒకరిద్దరి సభ్యులతో మాట్లాడించి ఉంటే బాగుండేదని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం సమాధానం సరిగా లేదంటూ కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం సభ్యులు అసెంబ్లీలో బుధవారం నిరసన చేపట్టారు. ఫీజు బకాయిలు విడుదల చేసేదాకా కదలబోమంటూ ఆందోళన చేసిన విషయం తెలిసిందే.