కాంపిటీటివ్ కౌన్సెలింగ్ | Competitive Counseling | Sakshi
Sakshi News home page

కాంపిటీటివ్ కౌన్సెలింగ్

Published Fri, Jul 11 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM

కాంపిటీటివ్ కౌన్సెలింగ్

కాంపిటీటివ్ కౌన్సెలింగ్

సివిల్స్ మెయిన్స్ పేపర్-2 (జనరల్ స్టడీస్-1) మొత్తం 250 మార్కులకు ఉంటుంది. ఇందులో ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ది వరల్డ్ అండ్ సొసైటీ నుంచి ప్రశ్నలు వస్తాయి.  సివిల్స్ మెయిన్స్ రెండో పేపర్ (జీఎస్-1)కు సంబంధించిన సిలబస్‌ను విశ్లేషిస్తే ‘చరిత్ర’కు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఈ సబ్జెక్టు పరిధి విస్తృతమైందని చెప్పొచ్చు. జనరల్ స్టడీస్ హిస్టరీ సిలబస్‌లో పేర్కొన్న కొత్త అంశాల్లో చాలావరకు ఆప్షనల్ సిలబస్ నుంచి తీసుకున్నవే. ఈ నేపథ్యంలో.. హిస్టరీ ఆప్షనల్‌తో పరీక్షకు సిద్ధమవుతున్నవారికి ఈ పేపర్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి
 అవకాశముంది.
 
సిలబస్‌లో పేర్కొన్న అంశాలను వరుసగా పరిశీలిస్తే.. భారతదేశ సంస్కృతి

సంగీతం, సాహిత్యం, నాట్యం, వాస్తు-శిల్పకళ, పెయింటింగ్స్, మత ఉద్యమాలు, తత్వాలు తదితర అంశాలపై క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఈ అంశాలను ప్రాచీన, మధ్య, ఆధునిక భారతదేశ చరిత్రలకు అన్వయించుకుంటూ పరీక్షకు సిద్ధమవాలి. అభ్యర్థులు ప్రామాణిక హిస్టరీ పుస్తకాల ఆధారంగా క్రమ పద్ధతిలో ఒక్కో అంశంపై పట్టు సాధిస్తూ ముందుకెళ్లాలి. ఎన్‌సీఈఆర్‌టీ 11, 12వ తరగతి పుస్తకాలు అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉంటాయి. మధ్య భారతదేశ చరిత్రకు సంబంధించినంతవరకు సతీశ్‌చంద్ర పుస్తకాలు చదవాలి. భారత సంస్కృతికి చెందిన అంశాలను ప్రాచీ న, మధ్య, ఆధునిక కాలాలకు అన్వయిస్తూ చదవాలి. ప్రాచీన, మధ్య, ఆధునిక భారతదేశ చరిత్రకు సంగీతం, సాహిత్యం, నాట్యం, కట్టడాలు, మత ఉద్యమాలు, తత్వాలపై దృష్టిసారించాలి.
 
 ఆధునిక భారతదేశం

 18వ శతాబ్దం మధ్య భాగం నుంచి ఇప్పటివరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలను క్షుణ్నంగా పరిశీలించాలి.
→    భారత దేశానికి ఐరోపా కంపెనీల రాక.
→    దేశంలో ఆంగ్లేయుల కార్యకలాపాలు విస్తరించిన తీరు.
→   ఆంగ్లేయుల ఆర్థిక, పరిపాలనా విధానాలు.
→    19, 20వ శతాబ్దాల్లో చోటుచేసుకున్న సామాజిక, మత సంస్కరణ ఉద్యమాలు.
→   {బిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు, ఉద్యమాలు.
→  చరిత్రలో కీలకమైన భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రత్యేకంగా చదవాల్సి ఉంటుంది. దీనికోసం ఆధునిక భారతదేశంపై బిపిన్‌చంద్ర రాసిన పుస్తకాలు చదవాలి. స్వాతంత్య్రం తర్వాత జరిగిన పరిణామాలను సిలబస్‌లో కొత్తగా చేర్చారు. ఇందులో చరిత్రతో పాలిటీ, ఎకనామిక్స్‌కు సంబంధించిన అంశాలు కూడా కలిసి ఉంటాయి. వీటిని సమన్వయం చేసుకుంటూ విషయంపై పట్టుసాధించాలి.
→    రాజ్యాంగ సంబంధిత అంశాలు
→   పంచవర్ష ప్రణాళికలు, ళీ భూ సంస్కరణలు
→   నెహ్రూ విదేశాంగ విధానం, ళీ అలీనోద్యమం తీరుతెన్నులు
→  హరిత విప్లవం రూపురేఖలు తదితరాలు..
→ వీటికోసం బిపిన్‌చంద్ర రాసిన ‘ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్’ పుస్తకం చదవాలి.
 
 ప్రపంచ చరిత్ర.. ఆకాశమే హద్దు

 ప్రపంచ చరిత్ర నుంచి ఏ అంశాలపై ప్రశ్నలు వస్తాయో కచ్చితంగా చెప్పడం కష్టం. 18వ శతాబ్దం నుంచి జరిగిన సంఘటనలను సిలబస్‌లో పేర్కొన్నారు కాబట్టి ఐరోపా, అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు సంబంధించి దేనిపైనైనా అడగడానికి అవకాశముంది.
→  {పపంచ ఆర్థికరంగ స్థితిగతుల్నే మార్చేసిన పారిశ్రామిక విప్లవం.
→    మొదటి ప్రపంచ యుద్ధం (1914-18),  రెండో ప్రపంచ యుద్ధం (1939-45)
→   ఐరోపాలో నూతన రాజ్యాల ఆవిర్భావం
→    ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో వలసవాదం స్వాతంత్య్ర ఉద్యమాలు.
→   వీటికోసం ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతి పుస్తకాలు చదవాలి.  

-  ఇన్‌పుట్స్: కరీం, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్
 
 
ఎస్‌బీఐ పీవో పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అంశాలకు ఎలా సన్నద్ధమవ్వాలో వివరించండి?
 - జి.నవీన్‌కుమార్, ఉప్పల్
 
 జనరల్ అవేర్‌నెస్.. అభ్యర్థులకు సామాజిక అంశాలపై ఉన్న అవగాహన స్థాయిని తెలుసుకునే ఉద్దేశంతో రూపొందించిన విభాగమిది. అంతేకాకుండా మార్కెటింగ్ అండ్ కంప్యూటర్స్ విభాగాన్ని కూడా జనరల్ అవేర్‌నెస్‌లోనే చేర్చారు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలోని మార్పులకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాలి. ఆర్‌బీఐ పాలసీలు, తాజా పరపతి విధానాలు; బ్యాంకుల వినూత్న పాలసీలు; బ్యాంకుల, కంపెనీల క్యాప్షన్లు వంటి వాటిపై అవగాహన తప్పనిసరి. వీటితోపాటు జీకేకు సంబంధించి క్రీడలు-విజేతలు, సదస్సులు-ప్రదేశాలు, అవార్డులు-వ్యక్తులు, వార్తల్లో వ్యక్తులకు సంబంధించి పరీక్ష సమయానికి ఆరేడు నెలల ముందు వరకు ప్రిపేర్ కావాలి. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్‌కు సంబంధించి ముఖ్యంగా జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్స్ హిస్టరీ, ఫండమెంటల్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన తప్పనిసరి. సి, సి++, ఎంఎస్-ఆఫీస్, ఒరాకిల్ తదితర సాఫ్ట్‌వేర్‌లు, డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌పై అవగాహన ఉండాలి.

 ఇన్‌పుట్స్: కె.వి.జ్ఞానకుమార్,
 సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement