కేసీఆర్‌వన్నీ అనైతిక చర్యలే: కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై కాంగ్రెస్ సమన్వయ కమిటీ తీవ్రస్థాయిలో విరుచుకు పడింది. ‘రాష్ట్రంలో ప్రభుత్వమూ లేదు. పాలనా లేదు. అయిదు నెలలుగా కేవలం రాజకీయం మాత్రమే చేస్తున్నా రు. అప్రజాస్వామికంగా, అనైతికంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు. ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకువెళతాం. పార్టీ ఫిరాయింపులు అనైతి కం..’ అని ఈ కమిటీ ధ్వజమెత్తింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, యాదయ్యలు సీఎం కేసీఆర్‌తో భేటీ అయి పార్టీ మారుతున్నట్టు ప్రకటించడంతో శుక్రవారం గాంధీభవన్‌లో ఈ కమిటీ హడావిడిగా సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులను చ ర్చించింది.
అనంతరం టీపీసీసీ చీఫ్ పొన్నాల, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో పార్టీ నేత డి.శ్రీనివాస్‌లు మీడియాతో మాట్లాడారు. ఇంత దయనీయమైన పాలన గత 60ఏళ్లలో ఎప్పు డూ చూడలేదని, చివరకు రాష్ట్రం లో 330 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వంలోని ఒక శాఖ 75 మంది అని, మరో శాఖ 79 మంది అని నివేదికలు ఇస్తున్నాయన్నారు. విద్యుత్ సమస్య, రైతులు ఆత్మహత్యలను కేం ద్రం దృష్టికి తీసుకవెళ్లడానికి సీఎం తీరిక లేకుండా పోయిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రలోభాలకు లొంగి ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలని చూడడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టన్నారు.