కంటోన్మెంట్ మార్గాన్ని ఉపయోగించుకునే పరిసర ప్రాంత వాసులకు శుభవార్త. ఇన్నాళ్లుగా సైనికాధికారుల ఆదేశాలతో మూసేసిన కంటోన్మెంట్ మార్గాలను వెంటనే తెరవాలని రక్షణమంత్రి ఆదేశించినట్లు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి తెలిపారు.
హైదరాబాద్లో సఫిల్గూడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే మార్గాన్ని కొన్నాళ్ల క్రితం మూసేశారని, దాంతో స్థానికులు అదనంగా పది కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని ఆయన తెలిపారు. గతంలోనే తాను ఈ సమస్యను కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ మార్గాలను వెంటనే తెరిచి, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా రక్షణ మంత్రి ఆదేశాలు ఇచ్చారని మల్లారెడ్డి తెలిపారు.
కంటోన్మెంట్ పరిసర ప్రాంత వాసులకు ఊరట!
Published Fri, Jan 23 2015 7:24 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM
Advertisement
Advertisement