హెచ్చార్సీను ఆశ్రయించిన ప్రేమజంట | Couple meet to hrc in hyderabad over protection | Sakshi
Sakshi News home page

హెచ్చార్సీను ఆశ్రయించిన ప్రేమజంట

Published Wed, Jun 8 2016 5:28 PM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM

హెచ్చార్సీను ఆశ్రయించిన ప్రేమజంట - Sakshi

హెచ్చార్సీను ఆశ్రయించిన ప్రేమజంట

హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను బుధవారం ఓ ప్రేమజంట ఆశ్రయించింది. నగరంలోని హబీబ్‌నగర్‌కు చెందిన సాయికుమార్, మంగళ్‌హాట్‌కు చెందిన ఆర్తి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

కులాలు వేరు కావడం, పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో వీరిద్దరూ రెండేళ్ల క్రితమే రహస్యంగా వివాహం చేసుకున్నారు. యువతి మైనర్ కావడంతో మేజర్ అయ్యేంతవరకు ఆగాలని పోలీసులు సర్దిచెప్పడంతో కొన్నాళ్లు వేచియున్నారు. ఇప్పుడు యువతి మేజర్ కావడంతో ప్రేమజంట ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం అమ్మాయి తరపు వారి నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని మానవ హక్కుల కమిషన్‌ను ప్రేమజంట ఆశ్రయించింది. హబీబ్‌నగర్ పోలీసులను ఆశ్రయించాలని హక్కుల కమిషన్ వారికి సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement