మియాపూర్‌లో నాటు బాంబు పేలుడు | Crude bomb blasts at dumping yard in hyderabad | Sakshi
Sakshi News home page

మియాపూర్‌లో నాటు బాంబు పేలుడు

Published Mon, Aug 14 2017 2:05 PM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM

Crude bomb blasts at dumping yard in hyderabad

హైదరాబాద్‌: మియాపూర్‌లోని డంపింగ్ యార్డులో సోమవారం మధ్యాహ‍్నం నాటుబాంబు పేలుడు కలకలం సృష్టించింది. డంపింగ్‌ యార్డులో ఒక గేదె మేత మేస్తుండగా ఒక‍్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు శబ‍్దం విన‍్న స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం, బాంబ్ స్క్వాడ్ లతో డంపింగ్‌ యార్డు పరిసరాలను క్షుణ‍్ణంగా తనిఖీ చేస్తున్నారు. రేపు స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనున్న తరుణంలో నాటు బాంబు పేలుడతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. నాటుబాంబు పేలుడును దృష్టిలో పెట్టుకుని నగరంలోని హోటళ‍్లు, రేల్వేస్టేషన్, బస్‌స్టేషన‍్లలో తనిఖీలు నిర‍్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement