- 7.8 లక్షల ఎకరాల్లోని పండ్లతోటలు గడ్డికి అనుకూలం
- స్టైలో, గిన్ని, లూసన్ రకాల గడ్డి పెంపకానికి అవకాశం
- గొర్రెల పంపిణీ పథకం అమలు నేపథ్యంలో సీఎంకు నివేదిక
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గొర్రెల పంపిణీ పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్యానశాఖ సన్నద్ధమైంది. గొర్రెలకు అవసరమైన గడ్డిని పెంచేందుకు ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో 7.8 లక్షల ఎకరాల్లోని పండ్ల తోటల్లో గడ్డిని పెంచేందుకు అవకాశముందని ఉద్యానశాఖ ప్రభుత్వానికి నివేదించింది. కలెక్టర్ల సమావేశం నేపథ్యంలో ఆ శాఖ సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పంపించింది. గొర్రెలకు పోషకాల పరంగా ఎటువంటి గడ్డి అవసరమో ఉద్యానశాఖ అధికారులు ఆ నివేదికలో ప్రస్తావించారు. గొర్రెలకు స్టైలో, గిన్ని, లూసన్ గడ్డి రకాలు బలవర్థకంగా ఉంటాయని పేర్కొన్నారు. వాటి విత్తనాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటాయో అధ్యయనం చేస్తున్నారు. ప్రభుత్వం అంగీకరిస్తే వాటిని తెప్పించి రాష్ట్రంలో సాగు చేయనున్నారు. ఇప్పటికే కర్ణాటకలో ఈ గడ్డిని రైతులు సాగు చేస్తున్నట్లు గుర్తించారు.
రైతులు ఒప్పుకుంటారా?
గొర్రెలను పండ్ల తోటల్లోకి పంపిస్తే తోటలు నాశనమయ్యే ప్రమాదముంది. దీంతో ఎంతమంది రైతులు అంగీకరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. రైతులు అంగీకరించకపోతే ప్రయోజనం ఏముం టుందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ భూములు, ప్రత్యేకంగా కేటాయించిన భూము ల్లోనైతే ఇటువంటి సమస్య రాదని అంటున్నారు. స్టైలో, గిన్ని, లూసన్ వంటి కొన్ని రకాల గడ్డిని అంతర పంటగా పెంచడంతో సాగులో ఉన్న పండ్లతోటలు ఏమైనా దుష్ప్రభావానికి గురవు తాయా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
గొర్రెల మేతకు ఉద్యాన శాఖ చేయూత
Published Sun, Apr 9 2017 12:18 AM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM
Advertisement
Advertisement