బాహుబలి-2లో డిఫరెంట్ లుక్: రానా | different look in bahubali -2 -rana | Sakshi
Sakshi News home page

బాహుబలి-2లో డిఫరెంట్ లుక్: రానా

Published Tue, Oct 13 2015 8:24 AM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM

బాహుబలి-2లో డిఫరెంట్ లుక్: రానా

బాహుబలి-2లో డిఫరెంట్ లుక్: రానా

బాహుబలి-2లో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తానని ప్రముఖ సినీనటుడు దగ్గుబాటి రానా పేర్కొన్నారు. సోమవారం గచ్చిబౌలిలోని ఇందిరానగర్‌లో ‘టోని అండ్ గై’ సెలూన్‌ను రానా ప్రారంభించారు. అనంతరం రానా మాట్లాడుతూ.. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న తారలు నూతన ట్రెండ్స్‌ను అనుసరిస్తూనే ఉంటారని తెలిపారు.
 

రోజూ జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేస్తానని ఈ మోడ్రన్ బల్లాల దేవుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోడళ్లు ప్రత్యేక కేశాలంకరణ, ఆధునిక దుస్తుల్లో హొయలుపోయారు. క్యాట్‌వాక్ చేసి సందడి చేశారు. టోని అండ్ గై నిర్వాహకులు షేక్ నూర్ మహ్మద్, శ్యామ్ ఫౌల్, మదన అగర్వాల్‌లు పాల్గొన్నారు.     
- సెంట్రల్ యూనివర్సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement