రైతు సంఘాల నిర్మాణంపై తర్జనభర్జన | Discussion on the structure of farmer communities | Sakshi
Sakshi News home page

రైతు సంఘాల నిర్మాణంపై తర్జనభర్జన

Published Mon, Jun 19 2017 2:23 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Discussion on the structure of farmer communities

సీఎం ఆదేశాలతో వ్యవసాయశాఖ మేధోమథనం
 
సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు సంఘాలను ఎలా ఏర్పాటు చేయాలన్న అంశంపై వ్యవసాయశాఖ మేధోమథనం చేస్తోంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రైతు సంఘాలను ఏర్పాటు చేస్తామ ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. వాటి ద్వారానే రైతులకు పెట్టుబడి ఖర్చు కింద ఎకరానికి రెండు పంట లకు రూ.8వేలు ఇస్తామని, రాష్ట్ర రైతు సమాఖ్య అధ్యక్షుడు సీఎం అంత పవర్‌ఫుల్‌ గా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర సమా ఖ్యకు రూ.500కోట్ల నిధిని ఇస్తామన్నారు. దీంతో ఇన్ని రకాలుగా బాధ్యతలు కల్పిస్తున్న రైతు సంఘాల నిర్మాణం ఎలా ఉండాలన్న అంశంపై వ్యవసాయ శాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. వచ్చే ఏడాది నాటికి వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తేనే స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.  
 
నామినేట్‌ చేస్తారా? ఎన్నికలా? 
రైతు సంఘాల ఏర్పాటు, వాటి పనితీరును మాత్రమే సీఎం ప్రస్తావించారు. కానీ వాటి నిర్మాణ స్వరూపం ఎలా ఉండాలన్న దానిపై ఇప్పటివరకు తమకు ఎలాంటి దిశానిర్దేశం చేయలేదని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. సీఎం చర్చపెడితే అందుకు తగ్గట్లు గా సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నామని మాత్రం అంటున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రైతు సంఘాలను ఏర్పాటు చేసే బాధ్యతను వ్యవసాయశాఖకే అప్పగించే అవకాశముంది.

అయితే వాటి కార్యవర్గం ఎలా ఉండాలి, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తదితరులను ఎలా నియమిస్తారన్న దానిపై స్పష్టత లేదు. వారిని వ్యవసాయశాఖ నామినేట్‌ చేస్తుందా? లేక ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారా? అన్న చర్చ జరుగుతోంది. డ్వాక్రా మహిళా సంఘాల తరహాలో ఈ రైతు సంఘాలుంటాయని అం టున్నారు. రైతులందరినీ ఐక్యపరిచే లక్ష్యం ఇందులో ఉంది. అదే సందర్భంలో రాజకీయ కోణమూ దాగి ఉందంటున్నారు. ఏదిఏమైనా రాష్ట్రంలోని 55 లక్షల మంది రైతులను సంఘాల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా వ్యవసాయ శాఖ పనిచేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement