యజమానిని గెలిపించిన శునకం!
యజమానిని గెలిపించిన శునకం!
Published Sun, Jul 24 2016 8:56 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM
సుభాష్‌నగర్: శునకాలంటే అతనికి ఎంతో మక్కువ... రెండు కుక్కలను తెచ్చి ప్రాణపదంగా పెంచుకుంటున్నాడు. వాటిలో ఓ కుక్క కనిపించకుండాపోయింది. దాని కోసం అన్ని చోట్ల వెదికినా ఫలితంలేదు. 20 రోజుల తర్వాత కనిపించిన ఆ శునకం యజమానిని ‘విశ్వాస పరీక్ష’లో నెగ్గించి మళ్లీ ఆయన చెంతకు చేరిం ది. ఆ కథా కమామీషు మీ కోసం..
సూరారం గ్రామానికి చెందిన జీవన్‌రెడ్డి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. రెండేళ్ల క్రితం డాబర్‌మాన్ జాతికి చెందిన కుక్కను తెచ్చి.. లక్కీ అని పేరుపెట్టుకొని పెంచుకుంటున్నారు. దీనికి తోడుగా మరో కుక్కను తెచ్చి బ్రౌనీ అనే పేరుపెట్టారు. జీవన్‌రెడ్డి వీటిని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఇరవై రోజుల క్రితం లక్కీ కనిపించకుండా పోయింది. దీంతో జీవన్‌రెడ్డి పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ దొరకలేదు. ఇదిలా ఉండగా... బ్రౌనీ గర్భం దాల్చడం తో సైనిక్‌పురిలోని వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లి సిజేరి యన్ చేయించగా మూడు పిల్లలకు జన్మనిచ్చింది. బ్రౌనీ, దాని పిల్లలను తీసుకొని జీవన్‌రెడ్డి, ఆయన బావమరిది వినోద్‌రెడ్డి ఆటోలో శనివారం సాయంత్రం ఇంటికి వస్తుండగా... సుచిత్రలోని చర్మాస్ పరి శ్ర మ వద్ద లక్కీ కనిపించింది.
సూరారం గ్రామానికి చెం దిన రాజేష్ అనే వ్యక్తి దానిని వాకింగ్‌కు తీసుకెళ్తున్నా డు. వెంటనే ఆటో దిగిన జీవన్‌రెడ్డి, వినోద్‌రెడ్డిలు రాజేష్‌తో ఆ కుక్క తమదని చెప్పడంతో గొడవ జరిగింది. దీంతో స్థానికులు పోగయ్యారు. విషయం తెలుసు కున్న వారు ‘విశ్వాస పరీక్ష’ పెట్టారు. కుక్కను మధ్య లో పెట్టి జీవన్‌రెడ్డి, రాజేష్‌లను పిలవమన్నారు. వారు పిలవగానే లక్కీ తన అసలు యజమాని జీవన్‌రెడ్డి దగ్గరకు వెళ్లి నిలబడింది. ఆ కుక్క ఆయనదేనని రుజువుకావడంతో రాజేష్ దానిని అప్పగించి వెళ్లిపోయాడు. తప్పిపోయిన లక్కీ తిరిగి రావడంతో యజమాని జీవన్‌రెడ్డి ఆనందానికి అవధుల్లేకుండాపోయింది.
Advertisement