హైదరాబాద్లో డ్రీమ్ వర్క్స్ థీమ్ పార్క్ | Dreamworks Plans for theme park in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో డ్రీమ్ వర్క్స్ థీమ్ పార్క్

Published Sat, May 28 2016 4:15 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

Dreamworks Plans for  theme park in hyderabad

*తెలంగాణలో ప్రఖ్యాత హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ డ్రీమ్ వర్క్స్ థీమ్ పార్క్
*హైదరాబాద్లో హై ఎండ్ ఎకో సిస్టమ్ థియేటర్ ఏర్పాటు
*తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నామన్న డ్రీమ్ వర్క్స్
*టీ హబ్ తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిన లాస్ ఏంజెల్స్  క్లీన్ టెక్ ఇన్ క్యుబేటర్
*ఐదో రోజు లాస్ ఏంజెల్స్ లో విజయవంతమైన మంత్రి కేటీఆర్ పర్యటన
 
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ముందుకొస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ అయిన డ్రీమ్ వర్క్స్, తన వ్యాపార విస్తరణకు తెలంగాణను ఎంచుకుంది. అమెరికా పర్యటనలో భాగంగా అయిదో రోజు లాస్ ఏంజెల్స్ లో పర్యటించిన ఐటీ,పురపాల శాఖ మంత్రి కె.తారకరామారావు, డ్రీమ్ వర్క్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సీఈవో జెఫ్రీ కాట్జన్ బర్గ్ ను కలుసుకున్న కేటీఆర్, ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలు గురించి వివరించారు.

భారత్ లో డ్రీమ్ వర్క్స్ సంస్థను విస్తరించే ఆలోచనలు ఉన్నాయన్న జెఫ్రీ, సమర్థ నాయకత్వంలో ముందుకు వెళుతున్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నామన్నారు. తమ దీర్ఘకాలిక ప్రణాళికల అమలులో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యం కోరుతున్నామన్నారు. అంతేకాకుండా తమ సినిమాల ప్రమోషన్ కోసం హైఎండ్ ఎకో సిస్టమ్ తో ఒక థియేటర్ ను నిర్మిస్తామని అందుకు సహకరించాలని మంత్రిని జెఫ్రీ కోరారు.

డ్రీమ్ వర్క్స్ కు చేతనైనంత సహాయం చేస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. డ్రీమ్ వర్క్స్  విస్తరణకు అంతర్జాతీయ స్థాయిలో త్వరలో హైదరాబాద్లో నిర్మించే ఫిల్మ్ సిటీకి అత్యంత అనుకూలంగా ఉంటుందన్నారు. ఇక పర్యాటకులను ఆకర్షించేందుకు హైదరాబాద్ లో చిన్నతరహా థీమ్ సెంటర్,  డ్రీమ్ ప్లేను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, డ్రీమ్ వర్క్స్ ఈ సమావేశంలో నిర్ణయించాయి. హైదరాబాద్ వచ్చి భారత మార్కెట్ అవసరాలు, స్థానిక నైపుణ్యాన్ని పరిశీలించాలని జెఫ్రీని మంత్రి కేటీఆర్ కోరారు.

అనంతరం కేటీఆర్ లాస్ ఏంజెల్స్ ఇన్నోవేషన్ సెంటర్ క్లీన్ టెక్ ఇంక్యుబేటర్ ను సందర్శించారు. నీటి సంరక్షణతో పాటు  మురుగునీటి శుద్దిలో వినూత్నమైన పద్దతులను అవలంబిస్తున్న క్లీన్ టెక్ పనితీరు, విజయవంతమైన తీరును అడిగి  తెలుసుకున్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన టీ హబ్ గురించి వివరించి తగిన సహకారం అందించాలని, కలిసి పనిచేయాలని కోరారు. ఇంక్యుబేటర్ సీఈఓను హైదరాబాద్ రావాలని మంత్రి ఈ సందర్భంగా ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement