ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఫెయిలవడంతో విద్యార్థి పరిస్థితి..
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో పాసవడంతో చివరి స్థానం
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ రాసిన ఓ విద్యార్థికి 160 మార్కులకు 116 మార్కులొచ్చాయి. కానీ ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల్లో ఒక సబ్జెక్టు ఫెయిలవడంతో ఎంసెట్ ర్యాంకు కేటాయించలేదు. వార్షిక పరీక్షల్లో పాసై ఉంటే 2 వేల వరకు ర్యాంకు వచ్చేది. అయితే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో పాసైన తర్వాత అతనికి కేటాయించిన ర్యాంకు 1,03,000. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మొదట ర్యాంకులను కేటాయించడం, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారికి తరువాత ర్యాంకులను కేటాయిస్తుండటమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని అనేక మంది విద్యార్థులకు ఇదే సమస్య.
‘అడ్వాన్స్‌డ్’ విద్యార్థులకు ర్యాంకులు
ఎంసెట్ రాసి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల్లో ఫెయిలై, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన 6,618 మంది విద్యార్థులకు గురువారం ఎంసెట్ కమిటీ ర్యాంకులను కేటాయించింది. అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ రాసిన వారిలో 3,229 మందికీ ర్యాంకులు కేటాయించింది. ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన 9 వేల మందికి పైగా విద్యార్థులకు ఎంసెట్ ప్రవేశాల కమిటీ ర్యాంకులను కేటాయించింది.
ఎంసెట్ మార్కులు 116..ర్యాంకు 1.03 లక్షలు
Published Fri, Jul 1 2016 12:51 AM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM
Advertisement
Advertisement