విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి
కొన్ని కళాశాలలు విద్యను వ్యాపారంగా మార్చాయి
- ప్రమాణాలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
- జేఎన్‌టీయూ స్నాతకోత్సవంలో గవర్నర్ నరసింహన్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పాటించని కళాశాల లపై చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే ఆశిస్తుందని గవర్నర్ నరసింహన్ చెప్పారు. కొన్ని యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయని, ఇలాంటి కళాశాలల పట్ల మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కనీస వసతులు, నిపు ణులు లేకపోయినా అడ్మిషన్లు తీసుకుంటున్నా యని, ఇలాంటి వాటికి ఎలా అనుమతిస్తు న్నారని అధికారులను ప్రశ్నించారు. జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది.
ప్రముఖ రక్షణ రంగ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్‌కుమార్ సారస్వత్‌కు వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. పరిశోధనా పత్రాలు సమర్పించిన వారికి పీహెచ్‌డీ అవా ర్డులతో పాటు ఇంజనీరింగ్‌లో అత్యుత్తుమ మార్కులు సాధించిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. గవర్నర్ మాట్లా డుతూ... ఉన్నత విద్య ఆశయాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న కాలేజీలను మూసివే యించడమే ఉత్తమమన్నారు. ‘ఓ సామాన్యు డిలా అడుగుతున్నా..’ అంటూ అధ్యాపకులు, విద్యార్థులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఖర్చులు తగ్గించే దిశగా సాగాలి...
ఒక అధ్యాపకుడు వంద మందికి గైడ్‌గా ఎలా వ్యవహరిస్తారని నరసింహన్ ప్రశ్నించారు. పీహెచ్‌డీ పట్టాలు ఉద్యోగుల పదోన్నతులకు పనికివస్తున్నాయేమో కానీ.. సమాజానికి ఏమాత్రం ఉపయోగపడటం లేదన్నారు. పరి శోధనలు సమాజానికి ఉపయోగపడినప్పుడే వాటికి విలువ ఉంటుందన్నారు. దేశ జనాభా రోజురోజుకూ పెరుగుతోందని, వారి అవసరా లకు అనుగుణంగా ఆహార పంటలు పండటం లేదని, చాలా మంది తిండి లేక, తాగేందుకు నీరు లేక పస్తులుండాల్సి వస్తుందన్నారు. ప్రస్తుతం దేశంలో ఆరోగ్య భద్రత లేదన్నారు. సాధారణ జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళితే.. అక్కిడి వైద్య ఖర్చులు భరించలేని స్థాయిలో ఉన్నాయని, వైద్య ఖర్చులు తగ్గించే దిశగా తమ పరిశోధనలు చేపట్టాలని విద్యార్థు లకు సూచించారు. సోలార్ పలకలు మన దగ్గర లేకపోవడంతో వాటిని జపాన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని, సామా న్యులకు ఈ ధరలు భారంగా మారుతున్నాయ ని, వీటి ధరలు తగ్గించే దిశగా పరిశోధనలు చేయాలన్నారు.
ఐ ప్యాడ్‌లతో మెదడుకు ముప్పు...
సాంకేతిక పరిజ్ఞానం పేరుతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రాథమిక దశలోనే ఐప్యాడ్‌లు, ల్యాప్‌టాప్‌లు చేతికిస్తున్నారని, ఇది పిల్లల ఆలోచనా పరిజ్ఞానాన్ని దెబ్బతీయడమే కాకుం డా వారి మెదడు పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందని నరసింహన్ హెచ్చరించా రు. నీటిపారుదల ప్రాజెక్టులపై పరిశోధనలు చేయడం ద్వారా వాటి ఫలాలు భావితరాలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
సాంకేతిక విద్యకు మంచి భవిష్యత్తు
విద్య విద్యార్థులకు ఓ ఆయుధం. చదువు, పరిశోధనలే విద్యార్థులను ఉన్న తులుగా తీర్చిదిద్దుతాయి. సాంకేతిక విద్య కు మంచి భవిష్యత్తు ఉంది. దేశంలో 300 మిలియన్ల మంది పేదరికంలో మగ్గుతు న్నారు. 833మిలియన్ల మంది మారు మూల గ్రామాల్లోనే జీవిస్తున్నారు. 260 మిలియన్ టన్నుల ఆహార ఉత్పత్తి జరుగు తుంది. అయినా 42 శాతం మంది పిల్లలు పోషకాహారలేమితో బాధపడుతున్నారు. ప్రతి వెయ్యికి 44మంది పిల్లలు చనిపోతు న్నారు. 2050 నాటికి సగం జనాభా నగరీ కరణ చెందుతుంది.వీరి అవసరాలు తీర్చా లంటే మరిన్ని పరిశోధనలు అవసరం.