గ్రేటర్‌లో ఎక్స్‌అఫీషియో సభ్యులు వీరే..
50 మంది నమోదు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎక్స్‌ఆఫీషియో సభ్యులుగా ఇప్పటిదాకా 50 మంది నమోదు చేసుకున్నారు. తాజాగా అందిన జాబితా ప్రకారం లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు మొత్తం 50 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటర్లుగా ఉన్నారు. వీరిలో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు 20 మంది, ఏఐఎంఐఎంకు 10, టీడీపీకి 8 మంది, బీజేపీకి 7, కాంగ్రెస్‌కు 5 మంది ఓటర్లు ఉన్నారు.
అయితే అధికారికంగా టీఆర్‌ఎస్‌కు 14 మంది ఉన్నట్లుగా నమోదు చేసుకున్నప్పటికీ ఒక ఇండిపెండెంటు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్‌లో చేరారు. టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. దీంతో టీడీపీ బలం 12 నుంచి 8కి పడిపోయింది. కాంగ్రెస్‌కు ఒకటి తగ్గి, మొత్తం ఆరుగురు సభ్యుల బలం టీఆర్‌ఎస్‌కు పెరిగింది. దీని ప్రకారం పార్టీల వారీగా బలాబలాలు మారాయి. మేయర్, డిప్యూటీ ఎన్నికలో కార్పొరేటర్లతోపాటు వీరికీ ఓటుహక్కు ఉంటుంది.
లోక్‌సభ సభ్యులు
1. కొత్త ప్రభాకర్ రెడ్డి (టీఆర్‌ఎస్)
2. కొండా విశ్వేశ్వర్ రెడ్డి (టీఆర్‌ఎస్)
3. సీహెచ్ మల్లారెడ్డి (టీడీపీ)
4. బండారు దత్తాత్రేయ (బీజేపీ)
5. అసదుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం)
రాజ్యసభ సభ్యులు
6. కె.వి.పి.రామచంద్రరావు (కాంగ్రెస్)
7. వి.హనుమంతరావు (కాంగ్రెస్)
8. రాపోలు ఆనందభాస్కర్ (కాంగ్రెస్)
9. సి.యం.రమేశ్ (టీడీపీ)
10. గరికపాటి మోహన్‌రావు (టీడీపీ)
శాసనమండలి సభ్యులు
11. పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్‌ఎస్)
12. కె.యాదవ రెడ్డి (టీఆర్‌ఎస్)
13. ఎస్.రాములు నాయక్ (టీఆర్‌ఎస్)
14. కె.స్వామి గౌడ్ (టీఆర్‌ఎస్)
15. మహమ్మద్ సలీమ్ (టీఆర్‌ఎస్)
16. నాయిని నర్సింహా రెడ్డి (టీఆర్‌ఎస్)
17. మహ్మద్ మహమూద్ అలీ (టీఆర్‌ఎస్)
18. పాతూరి సుధాకర్ రెడ్డి (టీఆర్‌ఎస్)
19. కె.జనార్ధన్ రెడ్డి (స్వతంత్ర-టీఆర్‌ఎస్‌లో చేరారు)
20. ఎం.ఎస్.ప్రభాకర్‌రావు (కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు)
21. మహ్మద్ షబ్బీర్ అలీ (కాంగ్రెస్)
22. ఎం.రంగారెడ్డి (కాంగ్రెస్)
23.సయ్యద్ అల్తాఫిదర్ రజ్వీ (ఏఐఎంఐఎం)
24. సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ (ఏఐఎంఐఎం)
25. ఎన్.రామచందర్‌రావు (బీజేపీ)
శాసనసభ్యులు
26. డాక్టర్ కె.లక్ష్మణ్(బీజేపీ)
27. జి.కిషన్ రెడ్డి (బీజేపీ)
28. చింతల రామచంద్రారెడ్డి(బీజేపీ)
29. టి.రాజాసింగ్ (బీజేపీ)
30. ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ (బీజేపీ)
31. మాగంటి గోపీనాథ్ (టీడీపీ)
32. కె.పి.వివేకానంద (టీడీపీ)
33. ఆర్.కృష్ణయ్య (టీడీపీ)
34. టి.ప్రకాశ్ గౌడ్ (టీడీపీ)
35. అరికెపూడి గాంధీ (టీడీపీ)
36. జాఫర్ హుస్సేన్ (ఏఐఎంఐఎం)
37. కౌసర్ మొయినుద్దీన్ (ఏఐఎఐఎం)
38. అహ్మద్‌బిన్ అబ్దుల్లా బలాల (ఏఐఎంఐఎం)
39. సయ్యద్ అహ్మద్‌పాషా ఖాద్రీ (ఏఐఎంఐఎం)
40. అక్బరుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం)
41. ముంతాజ్ అహ్మద్ ఖాన్ (ఏఐఎంఐఎం)
42. మహ్మద్ మౌజం ఖాన్ (ఏఐఎంఐఎం)
43. టి.పద్మారావు (టీఆర్‌ఎస్)
44. జి.మహిపాల్ రెడ్డి (టీఆర్‌ఎస్)
45. చింతల కనకా రెడ్డి (టీఆర్‌ఎస్)
టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరినవారు
46. తలసాని శ్రీనివాస్‌యాదవ్
47. జి.సాయన్న
48. ఎం.కృష్ణారావు
49. తీగల కృష్ణారెడ్డి
50. ఎల్విస్‌స్టీఫెన్‌సన్ (టీఆర్‌ఎస్‌నామినేటెడ్)