పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొంటామని ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కంల ఉద్యోగులు స్పష్టం చేశారు.
విద్యుత్ ఉద్యోగులు సమ్మెతో సోమవారం నుంచి కరెంట్ కష్టాలు తీవ్రతరం కానున్నాయి. ప్రభుత్వం దిగిరాకపోతే అత్యవసర సేవలు నిలిపివేస్తామని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమ్మెలో 60 వేల మంది ఉద్యోగులు పాల్గొనున్నారు. అయితే విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమ్మెను టీపీఈజేఏసీ వ్యతిరేకిస్తుంది. అలాగే సమ్మె పట్ల తటస్థంగా ఉంటామని టీఈఈ జేఏసీ స్సష్టం చేసింది.