
తొలగించిన ఐటీ ఉద్యోగులకు ఉపాధి
అక్రమంగా తొలగించిన ఐటీ ఉద్యోగులందరికీ ఉపాధి కల్పించాలని ఫోరమ్ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ వ్యవస్థాపక సభ్యుడు కిరణ్ చంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మూడు నెలల్లో 20 వేల మందిని తొలగించారని తెలిపారు. ఐటీ సంస్థల యాజమాన్యాలు కార్మిక చట్టాలను ఉల్లఘిం చకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకు ని ఐటీ ఉద్యోగులను ఆదుకోవాల న్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా జోన్ జేసీఎ ల్ చంద్రశేఖరంకు ఫోరమ్ ఆఫ్ ఐటీ ప్రొఫెష నల్స్ ఫౌండేషన్ సభ్యులు వినతిపత్రం సమర్పించారు. ఈ సమస్యల ను పరిష్క రించేందుకు కృషి చేస్తానని చంద్రశేఖరం చెప్పారని ఆయన తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఐటీ ఫోరం సభ్యులు లోకేశ్, సత్య, ఐటీ బాధితులు పాల్గొన్నారు.