సాక్షి,సిటీబ్యూరో:
నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు నాలుగురోజుల వ్యవధిలో మరో నకిలీ కరెన్సీ ముఠాను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.2 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అదనపు డీసీపీ లింబారెడ్డి కథనం ప్రకారం..కరీంనగర్ జిల్లా కట్నాపల్లికి చెందిన అన్నదమ్ములు పి.మునీందర్, పి.అనీల్‌ను నకిలీ నోట్లు తయారు చేసి చెలామణి చేయడం ద్వారా తేలిగ్గా డబ్బు సంపాదించాలని పథకం వేశారు. ప్రింటర్,స్కానర్ తదితరాలను కొనుగోలు చేసిన మునీందర్ నకిలీ రూ.100 నోట్లను తయారు చేయడం మొదలుపెట్టాడు. వీటిని తన స్నేహితుల ద్వారా మార్పిడి చేయిస్తున్నాడు. వీరి స్నేహితుడైన రామాంతపూర్ వాసి బి.శ్రీనివాసరావు కూడా కలవడంతో ‘వ్యాపారం’ జోరందుకుంది. గతంలో గుల్బర్గాకు చెందిన అర్జున్ అనే వ్యక్తి నకిలీ కరెన్సీ కావాలంటూ శ్రీనివాసరావును కోరడంతో మునీందర్ ద్వారా రూ.3 లక్షల విలువైనవి ముద్రింప చేయించి, వీటికి అర్జున్‌కు అప్పగించి రూ.లక్ష తీసుకురావడానికి వెళ్లాడు.
నకిలీ కరెన్సీ తీసుకున్న అర్జున్ పోలీసుల పేరు చెప్పి బెదిరించి అసలు నోట్లు ఇవ్వకుండా పంపేశాడు. వారంక్రితం మరోసారి అనిల్‌ను సంప్రదించిన శ్రీనివాసరావు హైదరాబాద్‌లో నకిలీనోట్లు తీసుకునేందుకు కొందరు ఆసక్తి చూపుతున్నారని, తీసుకురావాలని కోరాడు. దీంతో అనిల్, మునీందర్‌లు రూ.2 లక్షల విలువైన నకిలీ కరెన్సీతో పాటు ప్రింటర్, స్కానర్‌లను తీసుకొని నగరానికి చేరుకున్నారు. మార్పిడికి యత్నిస్తుండగా సమాచారమందుకున్న ఇన్‌స్పెక్టర్ కె.శ్రీకాంత్ నేతృత్వంలో పోలీసులు వలపన్ని మంగళవారం అరెస్టు చేశారు.
టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన ‘కరెన్సీ’ ముఠా
Published Wed, Oct 9 2013 3:57 AM | Last Updated on Thu, Jul 26 2018 1:42 PM
Advertisement
Advertisement