హైదరాబాద్ : రాజేంద్రనగర్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో సప్తగిరి ప్లాస్టిక్ కంపెనీలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై.... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లలో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని... మంటలు ఆర్పుతున్నారు.
అయితే అగ్నిప్రమాదంలో కంపెనీలోని మిషన్లు, ప్లాస్టిక్ సామాగ్రి అంతా కాలి బూడిద అయింది. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించిందని యాజమాన్యం తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ఈ ప్రమాదానికి గల కారణాలపై భద్రత సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.