
మైత్రీవనం వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు
హైదరాబాద్: నగరంలోని అమీర్పేట మైత్రీవనం వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో డ్రైవర్, కండాక్టర్తోపాటు ప్రయాణికులంతా బస్సులో నుంచి కిందకి దూకేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపకశాఖ సిబ్బంది ఫైరింజన్లతో సంఘటన స్థలానికి చేరుకుని.... మంటలార్పి వేశారు.
బస్సులో మంటలు చెలరేగడంతో మైత్రివనం వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి ప్రవేశించి ట్రాఫిక్ను పునరుద్దరించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే బస్సులో మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు