ఈ క్రమంలోనే నెలరోజులుగా ఫిలింనగర్‌లోని సాయిబాబా దేవాలయం సమీపంలో ఉన్న శ్రీ సాయి గెస్ట్‌హౌజ్‌కు తీసుకువెళ్లి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ నెల 27వ తేదీన యువతి గర్భం దాల్చింది. ఇదే విషయాన్ని కిషోర్‌కు చెప్పి తనను వెంటనే పెళ్లిచేసుకోవాలని కోరింది. దీనికి కిషోర్ నిరాకరించడంతో పాటు తాను కేవలం ఎంజాయ్ చేయడానికే నీతో ఉన్నాను తప్ప పెళ్లిచేసుకునేందుకు కాదంటూ ఎదురుదాడికి దిగాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు మణిపై ఐపీసీ సెక్షన్ 506, 420 కింద కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
Published Sun, Jul 30 2017 8:05 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
బంజారాహిల్స్(హైదరాబాద్): పెళ్లిచేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకుని గర్భం దాల్చిన తర్వాత ముఖం చాటేసిన యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకృష్ణానగర్‌లో నివసించే యువతి(19) తండ్రి చేసే ఇస్త్రీ బట్టల వ్యాపారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి బట్టలు సేకరిస్తుంటుంది. ఈ క్రమంలో అక్కడే నివసించే ఉద్యోగి మణికిషోర్(25)తో యువతికి పరిచయం ఏర్పడింది. ప్రతి రోజూ బట్టలకోసం తమ ఇంటికి వచ్చే యువతిని లోబర్చుకునేందుకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అమెతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగాడు.

Advertisement
Advertisement