ఊరెళ్లాల్సిందే!
‘ఒక్కసారి ఊరు వెళ్లి రా.. బతికున్న పల్లెల కోసం... అనుభూతుల మల్లెల కోసం...’ నగరం పల్లెబాట పట్టింది. సంక్రాంతి వేడుకలలో ఆత్మీయులతో కలసి పాల్గొనాలనే ఉత్సాహంతో ప్రయాణ కష్టాలను సైతం లెక్క చేయకుండా సాగుతున్నారు. రిజర్వేషన్లు లేకున్నా... రైళ్లు... బస్సుల్లో సీట్లు దొరక్కపోయినా... నిల్చొనైనా సరే ఊరు వెళ్లి తీరాల్సిందేనన్న పట్టుదలతో కదులుతున్నారు.
సంక్రాంతి సందర్భంగా నగర ప్రజలు పల్లెటూరు దారి పట్టడంతో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. రైళ్లు, బస్సులల్లో సీట్లు దొరకక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని ఏంజీబీఎస్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల
అవస్థలపై ‘సాక్షి’ చిత్రమాలిక. .