సమష్టిగా ఆలోచించాలి
తెలంగాణ విద్యుత్ సమస్యపై ప్రజా గాయకుడు గద్దర్
హైదరాబాద్ : శాస్త్రీయమైన విమర్శ చేయాల్సి వచ్చినపుడు సవుష్టిగా ఆలోచించాల్సిన అవసరముందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. తెలంగాణలో నేడు విద్యుత్ సమస్య అధిగమించడంలో మేధావులు, రాజకీయ నాయకులు, ప్రజలు సమధర్మం పాటించాల్సిన అవసరముందని తెలిపారు. ఉత్పత్తి ఎలా సాధించాలో మేధావులు వివరిస్తే, దాన్ని ఎలా తీసుకురావాలో నాయకులు ఆలోచించాలన్నారు.
ప్రజలు ఎలా పొదుపును ఆచరించాలో కూడా ఆలోచించాలని కోరారు. శని వారం సాయంత్రం హిమాయత్‌నగర్ 12వ వీధిలోని చంద్రం బిల్డింగ్‌లో ‘తెలంగాణలో విద్యుత్తు సమస్యలు-పరిష్కార మార్గాలు’ అన్న అంశంపై 146వ చర్చా కార్యక్రమంలో గద్దర్ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. టీఆర్‌సీ చైర్మన్ ఎం.వేదకుమార్ మాట్లాడుతూ కరెంటు కష్టాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరే కారణమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ డివిజన్ ఇంజనీర్ పి. మోహన్‌రెడ్డి, తెలంగాణ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అసోసియేషన్ అడ్వైజర్ నీలం జానయ్య, అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.శివాజీ పాల్గొని ప్రసంగించారు.