బంజారాహిల్స్ (హైదరాబాద్): కడుపులో మంటతో బాధ పడుతున్నవారు తగిన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే.. వారికి అల్సర్ సోకి తీవ్ర ప్రమాద స్థాయికి చేరుతుందని బెల్జియంకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ గై బాక్స్‌టెన్స్ చెప్పారు. శనివారం బంజారాహిల్స్‌లోని తాజ్‌దెక్కన్ హోటల్‌లో గ్యాస్ట్రో సొఫాజియల్ రెఫ్లెక్స్ డిసీజ్ (జీఈఆర్‌డీ) సదస్సు జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోద ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రవి శంకర్, చెన్నైకి చెందిన డాక్టర్ ప్రేమ్‌కుమార్‌తో కలిసి డాక్టర్ గై మాట్లాడారు.
సమయానికి తినడం, నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం వల్లే ఎసిడిటీ సమస్య నుంచి విముక్తి కావచ్చని గై చెప్పారు. ధూమపానం, మద్యపానం వల్ల ఈ సమస్య వస్తుందని పేర్కొన్నారు. నొప్పి నివారిణి కోసం వాడే పెయిన్ కిల్లర్స్‌తో ఎసిడిటీ సమస్య తీవ్రంగా ఉంటుందని డాక్టర్ రవిశంకర్ తెలిపారు. కడుపులోని యాసిడ్ ఛాతిలోకి రావడం వల్ల ఈ మంట వస్తుందని.. ఇది సాధారణమే అయినా నిర్లక్ష్యం చేస్తే ప్రమాదాలకు దారి తీసు ప్రమాదం ఉందని డాక్టర్ తెలిపారు.
కడుపు మంటే కదా అని తీసిపారేయకండి..!
Published Sat, Jun 13 2015 4:51 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM
Advertisement
Advertisement