రాష్ట్రానికి జర్మన్ కంపెనీలు
సీఎం కేసీఆర్‌తో భేటీలో జర్మనీ రాయబారి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు జర్మన్ కంపెనీలను తీసుకొస్తామని ఆ దేశ రాయబారి డాక్టర్ మార్టిన్ నెయ్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి కంపెనీలతో సంప్రదింపులు జరుపుతామని వెల్లడించారు. జర్మన్ కంపెనీల పెట్టుబడుల అవకాశాలపై మార్టిన్ నెయ్, గాబ్రియేల్ నెయ్ దంపతులు మంగళవారం క్యాంపు కార్యాల యంలో సీఎం కేసీఆర్‌తో చర్చించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని మార్టిన్ ప్రశంసించారు. దేశంలో ఉన్న 1,846 జర్మనీ కంపెనీల్లో అత్యధికంగా చెన్నై, పుణే కేంద్రంగా పనిచేస్తున్నాయని వివరించారు. కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఐరోపా, గల్ఫ్ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా దేశాలతో సంప్రదిస్తున్నాన్నారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని రాష్ట్రంలో అమ లు చేస్తున్నామని మార్టిన్‌కు వివరించి దాని కాపీని అందజేశారు. ఐటీ ఇంక్యుబేటర్, టీ-హబ్‌ల గురించి వివరించారు. జర్మనీ విద్యావిధానం, నైపుణ్యాభివృద్ధి శిక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని జర్మనీ రాయబార కార్యాలయ గౌరవ కౌన్సిల్‌గా బీవీ మోహన్ రెడ్డిని నియమించామని మార్టిన్ నెయ్ తెలి పారు. తెలంగాణ సంస్కృతిని తెలిపే ఆర్ట్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ టూరిజం పుస్తకాలను మార్టిన్‌కు కానుకగా సీఎం అందజేశా రు. మంత్రి కేటీఆర్, సీఎస్ రాజీవ్ శర్మ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, నాస్కామ్ ప్రతినిధి బీవీ మోహన్‌రెడ్డి, జర్మనీ కౌన్సిల్ జనరల్ అచిన్ ఫాబిగ్, ప్రొటోకాల్ అధికారి పద్మప్రియ పాల్గొన్నారు.