రేపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్
హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రేటర్ ఎన్నికల నగరా త్వరలో మోగనుంది. హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి రేపు అధికారకంగా నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీల్లో కసరత్తు సాగుతోంది. దాంతో గ్రేటర్‌లో రాజకీయంగా వేడిక్కుతోంది.
మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో తాము ఏ డివిజన్‌లో గెలిచే ఆస్కారం ఉందోనన్న దానిపై అధికార పార్టీ సర్వేలు నిర్వహిస్తోంది. ఈ రోజు సాయంత్రం లోగా తమ అభ్యర్థుల తొలి జాబితాను అధికార పార్టీ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా, ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం.. మంగళవారం నుంచి నామినేషన్లు దాఖలు చేయొచ్చు. నామినేషన్ల స్వీకరణకు 17వ తేదీ వరకు గడవు ఉండగా, ఫిబ్రవరి 2న పోలింగ్, 5న కౌంటింగ్ జరగనున్నాయి. ఒక్కో డివిజన్‌కు ఒక్కో రిటర్నింగ్ అధికారి చొప్పున మొత్తం 150 మందిని నియమించే అవకాశం కనిపిస్తోంది. వార్డుల వారీగా ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేస్తారు.