గ్రూప్-2 జవాబు పత్రాల డిజిటైజేషన్‌ | Group -2 answer document digitization | Sakshi
Sakshi News home page

గ్రూప్-2 జవాబు పత్రాల డిజిటైజేషన్‌

Published Tue, Nov 29 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

గ్రూప్-2 జవాబు పత్రాల డిజిటైజేషన్‌

గ్రూప్-2 జవాబు పత్రాల డిజిటైజేషన్‌

- భవిష్యత్తు అవసరాల కోసం జేపీజీ ఫార్మాట్‌లోకి మార్పు
- రేపటికల్లా పూర్తికానున్న ప్రక్రియ, ఆ తరువాతే ప్రాథమిక ‘కీ’ విడుదల

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 1,032 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఈ నెల 11, 13 తేదీల్లో నిర్వహిం చిన రాత పరీక్ష జవాబు పత్రాల డిజిటైజేషన్‌కు టీఎస్‌పీఎస్సీ శ్రీకారం చుట్టింది. భవిష్యత్తు అవసరాలు, రిఫరెన్‌‌స కోసం అభ్యర్థుల జవాబు పత్రా లను జేపీజీ ఫార్మాట్‌లోకి మారుస్తోంది. పరీక్ష రాసేందుకు 7,89,437 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 63 శాతం మంది హాజరయ్యారు. వారందరికి సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభానికి ముందే ఈ ప్రక్రియ చేపడుతోంది. దీంతో భవిష్యత్తులో మూల్యాంకనానికి సంబంధించిన సమస్యలు తలెత్తినా డిజిటలైజ్ చేసిన జవాబు పత్రాలను చూసుకునేలా వాటిని టీఎస్‌పీఎస్సీ సర్వర్‌లో భద్రపరుస్తోంది. తద్వారా పారదర్శకతకు పెద్దపీట వేయవచ్చని భావిస్తోంది.

ఈ ప్రక్రియ బుధవారం నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తరువాతే గ్రూప్-2 రాత పరీక్ష ప్రాథమిక ‘కీ’ని టీఎస్‌పీఎస్సీ విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి తగిన చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఆ తరువాతే చేపట్టి ఫలితాలను ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement