గుత్తాకు ఆ ప్రాజెక్టుపై అవగాహన లేదు: ఒంటేరు | gutta as no idea on that project : onteru | Sakshi
Sakshi News home page

గుత్తాకు ఆ ప్రాజెక్టుపై అవగాహన లేదు: ఒంటేరు

Published Thu, Jun 23 2016 3:20 AM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

gutta as no idea on that project  : onteru

మల్లన్నసాగర్ నిర్వాసితుల
సమస్యపై టీటీడీపీ చర్చ

 సాక్షి, హైదరాబాద్: మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అవగాహన లేకుండానే మాట్లాడుతున్నారని తె లుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో టీటీడీపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు నిర్వాసితుల సమస్యపై ఈ సమావేశంలో చర్చించారు. మెదక్  జిల్లా తొగుట మండలంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న నిర్వాసితులు గత కొద్ది రోజులుగా ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే.

నిర్వాసితుల ఆందోళనకు మద్దతుగా ఈ నెల 25, 26 తేదీల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేయనున్న దీక్షపైనా సమావేశం చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమాల సమన్వయ బాధ్యతను ఒంటేరు ప్రతాప్‌రెడ్డికి అప్పజెప్పాలని నిర్ణయం కూడా జరిగినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అనంతరం ఒంటేరు మాట్లాడుతూ ప్రాజెక్టును కుడలేరు వాగుపై ప్రాజెక్టు నిర్మిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement