కదంతొక్కిన విద్యార్థులు
♦ హెచ్‌సీయూలో తరగతుల బహిష్కరణ.. జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
♦ వీసీగా అప్పారావు ఉన్నంతకాలం ఆందోళన చేస్తామని స్పష్టీకరణ
♦ వర్సిటీలో పరిస్థితులపై హెచ్చార్సీకి వివరణ అందజేసిన వీసీ అప్పారావు
హైదరాబాద్: హెచ్‌సీయూ వీసీ అప్పారావు తిరి గి వర్సిటీలోకి రావడం, విద్యార్థులపై పోలీ సు లు లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ సోమవారం విద్యార్థులు కదంతొక్కారు. విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తరగతులను బహిష్కరిం చి.. ర్యాలీని నిర్వహించారు. వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట ధర్నా నిర్వహిం చారు. వీసీని తొలగించాల్సిందేని, అప్పటివరకు ఆందోళన విరమించబోమని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. రోహిత్ ఆత్మహత్య సహా అనేక పరి ణామాలకు కారణమైన వీసీని విధుల తొలగిం చాల్సిందేనని, అరెస్టు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని విద్యార్థి జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలని.. పోలీసులను క్యాం పస్ నుంచి పంపించాలని డిమాండ్ చేశారు.
బెయిల్‌పై హర్షం
హెచ్‌సీయూలో అరెస్టై రిమాండ్‌లో ఉన్న విద్యార్థులు, ప్రొఫెసర్లకు మధ్యంతర బెయిల్ రావడంతో విద్యార్థులంతా హర్షం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం క్యాంపస్ నుంచి ప్రధాన ద్వారం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల సహకారంతోనే బెయిల్ మంజూరైం దని విద్యార్థి నేత జుహెల్ కేపీ పేర్కొన్నారు. మరోవైపు విద్యార్థులు తరగతులను బహిష్కరించడంతో వీసీ నివాసం వద్ద పోలీసు బందోబస్తును తగ్గించారు. వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద హెచ్‌సీయూ భద్రతా సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఐడీ కార్డులున్న విద్యార్థులు, సిబ్బందిని లోపలికి అనుమతిస్తున్నారు.
హెచ్చార్సీకి నివేదిక అందజేసిన వీసీ
రోహిత్ ఆత్మహత్య తదనంతర పరిణా మాల్లో వర్సిటీ విద్యార్థులకు కనీస సదుపాయాలు కూడా అందడం లేదన్న ఫిర్యాదుపై మానవ హక్కుల కమిషన్ సోమవారం విచారణ చేపట్టింది. మధ్యాహ్నం 12.30 గంట లకు గట్టి పోలీసు బందోబస్తు మధ్య వీసీ అప్పారావు ఈ విచారణకు హాజరయ్యారు. వర్సిటీలోని పరిణామాలపై హెచ్చార్సీ చైర్మన్ జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రూకు ఒక నివేదికను అందజేశారు. వర్సిటీలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. బయటకు వచ్చిన అనంతరం మీడియా ప్రతినిధులు వీసీ అప్పారావును వివరాలడిగే ప్రయత్నం చేయగా... మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.