పాలమూరు–డిండి కట్టి తీరుతాం
శాసనమండలిలో హరీశ్
- ప్రస్తుత సమావేశాల్లోనే భూసేకరణ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెడుతాం
- ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్ర వాటాను పూర్తిగా ఉపయోగించుకునే దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాలమూరు–డిండి ప్రాజెక్టును కట్టి తీరుతామని స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు, బ్రిజేశ్ ట్రిబ్యునల్‌లు రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టును కడుతామని తెలిపారు. సోమవారం శాసన మండలిలో కృష్ణా, గోదావరి నదులపై వివిధ ప్రాజెక్టుల నిర్మాణం, వాటి రిపోర్టులు, ప్రస్తుత పరిస్థితి, వ్యయానికి తగిన ప్రయోజనం (కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్) తదితర అంశాలపై కాంగ్రెస్ సభ్యులు షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎం.రంగారెడ్డిలు వేసిన ప్రశ్నలకు హరీశ్‌రావు సమా ధానాలు ఇచ్చారు. ప్రస్తుత సమావేశాల్లోనే భూసేక రణ చట్ట సవరణ బిల్లును తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. విపక్ష సభ్యులు అడ్డగోలుగా విమర్శలు చేస్తు న్నారన్నారు. సాగునీటి ప్రాజె క్టులపై చర్చించేందుకు పూర్తిగా ఒకరోజు సమయాన్ని కేటా యిం చాలని స్వామిగౌడ్‌కు విజ్ఞప్తి చేశారు.
రెండు నాల్కల ధోరణి
కాంగ్రెస్ సభ్యుల తీరు నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిం చనట్లుగా ఉందని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఓవైపు ప్రాజెక్టులను అడ్డుకోవ డానికి ప్రయత్నిస్తూ, భూసేకరణ నిలుపుదల కోసం కోర్టుల్లో కేసులు వేస్తూనే.. మరోవైపు మాత్రం త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరుతున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో కేసులు వేయించి, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసి ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. కాంగ్రెస్ నేతలు హైకోర్టు లో, గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేశారని పేర్కొన్నారు.
ఇష్టారాజ్యంగా వ్యవహరించొద్దు
ప్రాజెక్టుల కోసం రూ.2.46 లక్షల కోట్ల అప్పులు చేస్తు న్నారని.. కేంద్ర గ్రాంటు రాకుండా ఆ రుణాలను ఏ విధం గా చెల్లిస్తారని శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ నిలదీశారు. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా వెళ్లి ఉంటే ఏపీలో పోలవరం మాదిరిగా ప్రాణహితకు జాతీయ హోదా వచ్చి ఉండేదని ఆయన చెప్పారు. ఇక పాలమూరు–డిండి ప్రాజె క్టులను నిలిపివేసిన మాట వాస్తవమేనా అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. డబ్బులు లేకుండా, డీపీఆర్‌లు లేకుండా భూసే కరణ జరగకుండా టెండర్లు పిలిచి గందరగోళం సృష్టిం చడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సూచించారు.
అన్ని ప్రాజెక్టులకూ డీపీఆర్‌లు ఉన్నాయి
నాలుగేళ్లలో ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేక పోయిందని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఏటా మూడు వేల టీఎంసీల గోదావరి జలాలు సము ద్రంలో వృథాగా కలుస్తు న్నందున.. ఆ నీటిని వినియో గించుకునేలా ప్రాణ హిత ప్రాజెక్టును రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు చెప్పారు. అన్ని ప్రాజెక్టులకూ డీపీఆర్‌లు ఉన్నాయన్నారు.