
వర్షం.. హర్షం
నగరంలో శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వేసవి ఎండలతో అల్లాడుతున్న నగర ప్రజలకు ఉపశమనం లభించింది.
నగరంలో శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వేసవి ఎండలతో అల్లాడుతున్న నగర ప్రజలకు ఉపశమనం లభించింది. రామంతాపూర్‌లో రోడ్లు జలమయమయ్యాయి. బడంగ్‌పేట నగర పంచాయితీ పరిధిలోని బాలాజీనగర్‌లో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షానికి పలు ఇళ్ల పైకప్పులు కూలాయి. తహసీల్దార్ సుశీల సంఘటన స్థలాన్ని పరిశీలించి నష్టపరిహారం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.