అగ్రిగోల్డ్ ఆస్తులు ఎందుకు అమ్మట్లేదు: హైకోర్టు
హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసుపై గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో అమరావతిలో అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకానికి ఎందుకు నిరాకరిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సీఆర్‌డీఏ అధికారులు కోర్టుకు హాజరుకావాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
మొదటి విడతలో 50 శాతం ఆస్తులు విక్రయించామని విచారణ కమిటీ హైకోర్టుకు తెలిపింది. దీని ద్వారా రూ. 60 కోట్లు వచ్చాయని హైకోర్టుకు విన్నవించింది. రెండో విడతలో రూ. 150 కోట్ల ఆస్తులు అమ్మకానికి సిద్ధంగా ఉంచామని కమిటీ తెలిపింది. మూడో విడతలో రూ. 180 కోట్ల ఆస్తులు అమ్మకానికి సిద్ధంగా ఉంచామని కమిటీ హైకోర్టుకు విన్నవించింది. కాగా, విచారణ కమిటీ వాదనలు విన్న అత్యుతన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.