
గణేశ్ విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించొద్దు
హైదరాబాద్ : వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసే గణేశ్ విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించరాదని హైకోర్టు సూచించింది. అంతకంటే ఎక్కువ ఎత్తులో విగ్రహాలు ఏర్పాటు చేయరాదని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితికి సూచనలు చేసింది. విగ్రహాల పేరుతో హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవటం తగదని న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది.
మరోవైపు విగ్రహాల ఎత్తును తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా నగరంలో మెట్రో నిర్మాణం కారణంగా వినాయకుని విగ్రహలు ఈసారి 15 అడుగుల ఎత్తు మాత్రమే ఉండేలా చూడాలని ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కూడా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.