కాంగ్రెస్‌ను వీడను: చిరంజీవి | I am not joining in BJP untill continue in politics, says Chiranjeevi | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను వీడను: చిరంజీవి

Published Thu, Feb 25 2016 2:44 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కాంగ్రెస్‌ను వీడను: చిరంజీవి - Sakshi

కాంగ్రెస్‌ను వీడను: చిరంజీవి

సినీనటుడు, ఎంపీ చిరంజీవి
 హైదరాబాద్: కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను సినీనటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఖండించారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీ లేదా టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తన జీవిత కాలం మొత్తం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, పార్టీని వీడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. బుధవారం ఫిలింనగర్ దైవసన్నిధానంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. తాను పార్టీ మారుతున్నట్లు కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాలు అవాస్తవమని పేర్కొన్నారు. టీడీపీకి, బీజేపీకి దగ్గరవుతున్నానంటూ తన ప్రమేయం లేకుండానే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement