రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా మరో ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా మరో ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురిశాయని వెల్లడించింది. శనివారం ఆదిలాబాద్‌లో అత్యధికంగా 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు అయింది. మరోవైపు హైదరాబాద్‌లో శనివారం వాతావరణం బాగా చల్లబడింది. 34.5 డిగ్రీల గరిష్ట, 27 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ప్రాంతం ఉష్ణోగ్రత
ఆదిలాబాద్ 43.3
రామగుండం 41.0
నిజామాబాద్ 40.3
మెదక్ 37.6
భద్రాచలం 35.0
నల్లగొండ 34.6
హైదరాబాద్ 34.5
హకీంపేట 33.9
ఖమ్మం 32.2