సొంతింటి సంబరం | inauguration of a double bedroom homes | Sakshi
Sakshi News home page

సొంతింటి సంబరం

Published Mon, Nov 16 2015 11:22 PM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

సొంతింటి సంబరం - Sakshi

సొంతింటి సంబరం

అట్టహాసంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం
పట్టాలు అందించిన సీఎం
ఐడీహెచ్ కాలనీ వాసుల్లో ఆనందం

 
 నగరంలోని ఐడీహెచ్ కాలనీలో పేదల కోసం నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రారంభించారు. కొంతమంది లబ్ధిదారులకు ఆయనే స్వయంగా ఇళ్ల పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి,    తలసాని శ్రీనివాస యాదవ్, టి.పద్మారావు తదితరులు పాల్గొన్నారు.
 
బన్సీలాల్‌పేట్:  సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఐడీహెచ్ కాలనీలో పేదల సామూహిక (డబుల్ బెడ్ రూమ్) ఇళ్ల ప్రారంభోత్సవాన్ని సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్‌తో పాటు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావు, నాయిని నర్సింహారెడ్డిలు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్‌కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2.25 గంటలకు శిలాఫలకాన్ని ఆవిష్కరించి... ఇళ్లను ప్రారంభించారు. సికింద్రాబాద్ పరిసర మురికివాడల నుంచి పెద్ద ఎత్తున మహిళలు ఐడీహెచ్ కాలనీకి చేరుకున్నారు. సభా ప్రాంగణం మహిళలతో కిక్కిరిసిపొయింది. జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ ఇళ్లను రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సి.కనకారెడ్డి, మాధవరపు కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ పరిపాలన, అర్బన్ విభాగం ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, జోనల్ కమిషనర్ హరి చందన దాసరి, డిప్యూటీ కమిషనర్ విజయరాజ్, హౌసింగ్ ఈఈ వెంకటదాస్ రెడ్డి, డిప్యూటీ ఈఈ రఘనందన్‌రావు, జలమండలి జీఎం మహేష్, డిప్యూటీ జీఎం హరుణాకర్‌రెడ్డి, మేనేజర్లు కృష్ణ, నాగరాజు, సికింద్రాబాద్ ఆర్డీఓ రఘురామ్ శర్మ, తహసీల్దార్ విష్ణుసాగర్ తదితరులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తుండటంతో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బన్సీలాల్‌పేట్, సోమప్పమఠం, చిలకలగూడ, పార్సీగుట్ట, చింతబావి తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి మాత్రమే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐడీహెచ్ కాలనీ అధ్యక్షుడు ఎ.శ్రీనివాస్, దక్షిణామూర్తి, గజ్జెల శ్రీనివాస్, వినోద్, రాజు, సురేష్, టీఆర్‌ఎస్ నాయకులు ఎ. కృష్ణమూర్తి, ఏసూరి మహేష్, కె.దేవేందర్, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
 
ప్రజలతో కలిసి సీఎం భోజనం

 ఇళ్లను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ స్థానికులతో కలసి భోజనం చేశారు. దీంతో  వారిలో ఆనందం వ్యక్తమైంది.
 వెల్లివిరిసిన ఆనందం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న పక్కా ఇళ్ల నిర్మాణ కల సాకారం కావడంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. నూతన ఇళ్ల నిర్మాణంతో తమ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని పలువురు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులు ఇళ్ల పట్టాలు అందుకున్నారు. జి.జయమ్మ, రేణుకాబాయి, నందకుమారి, ఎం.లక్ష్మిలకు సీఎం స్వయంగా పట్టాలు అందించారు.
 
 సైడ్‌లైట్స్
మధ్యాహ్నం 2.15 గంటలకు సీఎం కేసీఆర్ ఐడీహెచ్ కాలనీకి చేరుకుని నూతన గృహాలను ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావులు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు.... లంబాడీ నృత్యాల మధ్య సీఎంను సభా స్థలికి తీసుకువచ్చారు.    ీీసీఎం మాట్లాడుతున్నప్పుడు టపాసుల శ బ్దం వినిపించింది. దీంతో ఆయన ప్రసంగాన్ని ఆపి ‘శ్రీనివాస్ యాదవ్... కాల్చేటోడు మనోడేనా లేక...ఇంకెవడైనా మోపైయిండా?’ అని ప్రశ్నించడంతో సభలో నవ్వులు విరిశాయి.  ీసీఎం మాట్లాడుతున్నప్పుడు సోమప్పమఠం బస్తీకి చెందిన మహిళలు లేచి కలువడానికి ప్రయత్నించగా...ఆయన స్పందిస్తూ..   ‘మీరు అక్కడే ఉండండి. తర్వాత మీ ముచ్చట వింటా...వినతులు తీసుకుంటా’నన్నారు. సీఎం కార్యక్రమం అనంతరం భోజనానికి   వెళ్లారు. పెద్ద ఎత్తున మహిళలు ఆయనను కలువడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలు ‘మా బాధలు వినరా? మమ్మల్ని పట్టించుకోరా? అంటూ తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభించి సుమారు 8 నిమిషాల్లోనే ముగించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఐడీహెచ్ కాలనీ ప్రజలతో పాటు తాను కూడా సీఎం కేసీఆర్‌కు జన్మంతా రుణ పడి ఉంటానని పేర్కొనడం గమనార్హం.   కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తన ప్రసంగంలో పేదలకు నిజమైన దీపావళి ఈ రోజు అంటూ సీఎం కేసీఆర్... తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందనలతో ముంచెత్తడం విశేషం.కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తన ప్రసంగంలో సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జీవై కంపౌండ్, రామస్వామి కంపౌండ్, నీలం బాలయ్యదొడ్డి, బన్సీలాల్‌పేట్ మురికివాడల్లో ఏళ్ల తరబడి జీవనం సాగిస్తున్న పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొవాలని ప్రత్యేకంగాా కోరారు.
     
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ‘ఇల్లు కట్టి చూడు...పెండ్లి చేసి చూడు’ అనే నానుడిని తెలంగాణ యాసలో చెబుతూ ఆకట్టుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో ఆద్యంతం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావులు  చెట్టాపట్టాలేసుకొని కార్యక్రమాన్ని నిర్వహించడం కనిపించింది. ఇద్దరూ కలిసి గుసగుసలాడుతూ భోజనం చేస్తున్న దృశ్యాన్ని చాలా మంది సెల్‌ఫోన్‌లలో బంధించారు. నాటి రాజకీయ ప్రత్యర్థులు ... నేడు ఒకే క్యాబినెట్‌లో మంత్రులుగా ఉంటూ ముందుకు సాగుతున్న ైవె నంపై అంతా చర్చించుకున్నారు.

సీఎం కేసీఆర్ వేదికపై జ్యోతి వెలిగించి అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పిలిచి వేదిక ముందున్న వాళ్లను పక్కకు జరపాలని సూచించారు. దీంతో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, టి. పద్మారావులు వేదిక దిగి వచ్చి ముందున్న మీడియా ప్రతినిధులు, ఇతరులను పక్కకు తప్పించారు.{పారంభోత్సవం తర్వాత సికింద్రాబాద్ పరిసర మురికివాడల నుంచి వచ్చిన అనేక మంది మహిళలు మంత్రులు టి.పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను చుట్టుముట్టి తమ బస్తీలలో పక్కాఇళ్లు నిర్మించాలని కోరారు. ఐడీహెచ్ కాలనీ పరిసర ప్రాంతాలు.... రోడ్లపై పెద్ద ఎత్తున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎం కేసీఆర్‌ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
     
పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గోదాస్ కిరణ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు అమీర్‌పేట నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాస్క్‌లను ముఖాలకు తగిలించుకొని ద్విచక్ర వాహనాలపై బయలుదేరి వెళ్లారు.గతంలో సీఎం ఇక్కడకు వచ్చినప్పుడు ఇళ్లు కావాలని కోరాం. అప్పట్లో ఆయన ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇవ్వలేదు. ఇదే విషయాన్ని తిరిగి సీఎం దృష్టికి తీసుకెళ్దామంటే స్థానిక నాయకులు కలవనీయడం లేదంటూ అనూరాధ, పుష్పలత తదితర మహిళలు ఆరోపించారు. తమను సీఎం వద్దకు వెళ్లనివ్వాలని కోరుతూ ఆందోళనకు దిగారు. ఇంకొందరు తమకు ఎక్కువమంది సంతానం ఉన్నందున, ఎదిగిన పిల్లలకు కూడా సదుపాయంగా ఉండేందుకు రెండు ఫ్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement