తెలంగాణ రాష్ట్ర జంతువుగా అడవిదున్న! | indian bison to be state animal of telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ రాష్ట్ర జంతువుగా అడవిదున్న!

Published Fri, Aug 22 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM

తెలంగాణ రాష్ట్ర జంతువుగా అడవిదున్న!

తెలంగాణ రాష్ట్ర జంతువుగా అడవిదున్న!

అటవీశాఖ ఆమోదం..సీఎంవోకు చేరిన ఫైలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జంతువుగా అడవిదున్న ఖరారైంది. దీనికి సంబంధించిన ఫైలుపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న గురువారం సంతకం చేసి, ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించారు. ఇండియన్ బైసన్‌గా వ్యవహరిస్తున్న అడవిదున్న రాష్ట్ర జంతువుగా ఖరారు చేశారు. రాష్ట్ర పక్షిగా పాలపిట్ట (ఇండియన్ రోలర్)ను నిర్ణయించారు.

రాష్ట్ర చెట్టుగా ఇప్పచెట్టును ప్రకటించనున్నారు. రాష్ట్ర పుష్పంగా మోదుగుపువ్వును ఖరారు చేశారు. వీటిని రాష్ట్ర అటవీశాఖ ఆమోదించి, సీఎం కేసీఆర్‌కు ఫైలును పంపించారు. అది సీఎం కార్యాలయానికి చేరింది. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన వెంటనే వీటిని అధికారికంగా ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement